Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్.. జైలుకు త‌ర‌లింపు…

ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్.. జైలుకు త‌ర‌లింపు…
-డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ
-ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర వ‌రం జైలులో అనంత‌బాబు
-అహం దెబ్బ‌తిన‌డం వ‌ల్లే హ‌త్య అన్న పోలీసులు
-డ్రైవ‌ర్ శ‌రీరాన్ని మ‌రింత గాయ‌ప‌ర్చి ప్ర‌మాదంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నమ‌ని వ్యాఖ్య‌

ఏపీలోని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో విచార‌ణ కొన‌సాగుతోంది.అంతబాబే డ్రైవర్ ను హత్య చేసి దాన్ని మసిపూసి మారేడు కాయను చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరకు కటకటాల పాలైయ్యారు . ఆయన హత్య చేశాడని నిర్దారణకు వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు . మేజిస్ట్రేట్ 14 రోజుల రేమండ్ కు తరలించారు .

ఇప్ప‌టికే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అనంత బాబును పోలీసులు రాజ‌మ‌హేంద్రవ‌రం జైలుకు త‌ర‌లించారు.

సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తానే చంపిన‌ట్లు అనంత‌బాబు అంగీక‌రించార‌ని ఇప్ప‌టికే కాకినాడ‌ పోలీసులు చెప్పారు. అహం దెబ్బ‌తిన‌డం వ‌ల్లే ఎమ్మెల్సీ ఈ హ‌త్య చేశాడ‌ని పోలీసులు అంటున్నారు. సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని తోసేయ‌డం వ‌ల్ల అత‌డు గాయ‌ప‌డి చ‌నిపోయాడ‌ని, ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు అత‌డి శ‌రీరాన్ని మ‌రింత గాయ‌ప‌ర్చార‌ని పోలీసులు చెప్పారు.

Related posts

సూట్‌కేసులో కుక్కి గాళ్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌కు తెచ్చే యత్నం.. దొరికిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి.. 

Drukpadam

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు దారుణ హత్య!

Ram Narayana

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు: ఇన్నోవా కారు డ్రైవర్, నిందితుల తల్లిదండ్రులపై కేసుల నమోదు!

Drukpadam

Leave a Comment