Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దటీస్ స్టాలిన్ …తమిళుల జైజైలు…

దటీస్ స్టాలిన్ …తమిళుల జైజైలు…
-మోదీ ముందే త‌మిళ వాదం వినిపించిన సీఎం స్టాలిన్‌
-చెన్నై ప‌ర్య‌ట‌న‌లో మోదీ
-త‌మిళ‌నాడులో త‌మిళ‌మే మాట్టాడ‌తామ‌న్న స్టాలిన్‌
-ద్ర‌విడ మోడ‌ల్ పాల‌న‌ను దేశానికి చూపిస్తామ‌ని వెల్ల‌డి

ప్రధాని మోడీ నేడు తమిళనాడు పర్యటనకు వెళ్లారు . అక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని ముందే తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టి శబాష్ అనిపించుకున్నారు .తమిళనాడులో హిందీ భాష రుద్దాలని ప్రయత్నాన్ని స్టాలిన్ పరోక్షంగా ప్రస్తావించారు. తమిళనాడులో ప్రజలు తమిళమే మాట్లాడతారని ఎలాంటి శషభిషలు లేకుండా ప్రధానికి తెలిపటం ద్వారా బలంవంతంగా హిందీని రుద్దవద్దని చెప్పకకనే చెప్పారు . అంతే కుండా ద్రవిడ మోడల్ పాలన దేశానికి చూపిస్తామని కూడా స్టాలిన్ చెప్పటం సంచలనంగా మారింది. దీంతో తమిళ ప్రజలు స్టాలిన్ కు జైజైలు పలుకుతున్నారు . దటీస్ స్టాలిన్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు .

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెన్నై ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. మోదీ ముందే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ త‌మిళ వాదాన్ని, ద్ర‌విడ వాదాన్ని వినిపించారు. త‌మిళ‌నాడులో త‌మిళ‌మే మాట్లాడ‌తామంటూ ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా ద్ర‌విడ మోడ‌ల్ పాల‌న‌ను యావ‌త్తు దేశానికి చూపిస్తామంటూ స్టాలిన్ మ‌రింత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

 

అనంత‌రం కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య సంబంధాల‌ను ప్ర‌స్తావించిన స్టాలిన్‌.. రాష్ట్రాల‌కు నిధులు ఇవ్వాల్సిన బాధ్య‌త కేంద్రానిదేన‌ని తేల్చి చెప్పారు. రాష్ట్రాల‌తో కేంద్ర క‌లిసి ప‌నిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని కూడా ఆయ‌న తెలిపారు. త‌మిళ‌నాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధుల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని కూడా స‌భా వేదిక‌గానే మోదీని స్టాలిన్ కోరారు.

Related posts

చెప్పులపై జీఎస్టీకి నిరసన.. చెప్పులు కుట్టి, పాలిష్ చేసిన సీపీఐ నారాయణ!

Drukpadam

స్వంత పార్టీ పై సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చురకలు …

Drukpadam

మోడీ పై ప్రియాంక గాంధీ పోటీచేస్తే ఆమె గెలుస్తుందన్న సంజయ్ రౌత్ …!

Ram Narayana

Leave a Comment