Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వివేకా హత్య కేసుపై విజయమ్మ సంచలన ఆరోపణ…

వివేకా హత్య కేసుపై విజయమ్మ సంచలన ఆరోపణ…
-బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డిపై అనుమానాలు
-నిజాలు నిగ్గుతేలాల్సిందే -మాకుటుంబం అదే కోరుకొంటుంది.
-చంద్రబాబు అధికారం లో ఉండగానే హత్య జరిగింది.
-దోషులను ఎందుకు పట్టుకోలేదు
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఏపీ సీఎం జగన్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. కావాలనే తమ కుటుంబం పై అనుమానాలు రేకెత్తే విధంగా వార్తలు వస్తున్నాయని ,ఢిల్లీలో సునీతా చెప్పేది మేము కోరుకొనేది ఒకటే నాని అన్నారు. ఇందులో రెండవ అభిప్రాయానికి తావులేదన్నారు. ఈ హత్య కేసుపై చంద్రబాబు ప్రభుత్వం ఉన్న దగ్గరనుంచి విచారణ జరుగుతుందని అన్నారు. అప్పుడే నిజమైన హంతకులను తేల్చవద్దని ఎవరు అన్నారని ఆమె ప్రశ్నించారు. తమకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆదినారాయణ రెడ్డి పై అనుమానాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. వివేకా కూతురు సునీతా ఢిల్లీ లో సిబిఐ అధికారులను కలిసిన అనంతరం మీడియా తో మాట్లాడుతూ తన పెదనాన్న దివంగత నేత వైయస్ కుమారుడు ప్రస్తుత సీఎం జగన్ కు వివేకా హత్య తో సంబంధం ఉన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడటంపై విజయమ్మ స్పందించారు. సునీతా ఆవిధంగా మాట్లాడలేదన్నారు. కేసును సిబిఐ కి అప్పగించిన తరువాత తేల్చాల్సింది వాళ్ళు దీనిపై టీడీపీ ,ఇతర పార్టీలు రాద్దాతం చేస్తున్నాయి. హత్య జరిగినప్పుడు అధికర్మలో ఎవరు ఉన్నారు .చంద్రబాబు ఉన్నారు. ఆయన దోషులు ఎవరని ఎందుకు తేల్చలేదు. మా కుటుంబం ఎదో చేసిందనే రీతిలో జగన్ కు సంబంధం ఉండనే అర్థం వచ్చేట్లు మాట్లాడటం సరైంది కాదు అని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి సిబిఐ ను కలిసిన వివేకా కూతురు సునీతా కేసును తొందరగా తేల్చాలని అడిగారని అదే విషయాన్నీ మీడియా ముందట చెప్పారని దీనిపై రాద్ధాంతం చేయటం తగదన్నారు. హత్య జరిగినప్పుడు ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు కాబినెట్ లో మంత్రిగా ఉన్నారని హత్య జరిగిన తరువాత కూడా రెండునెలలు చంద్రబాబు ప్రభుత్వమే అధికారం లో ఉందని అప్పుడు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి తరువాత బీజేపీ లో చేరారని ఆమె తన ప్రకటనలో వివరించారు. కేసును పక్కదార్లు పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయేమోననే అనుమానాలు ఉండటం సహజమని అన్నారు. ఈ కేసులో దోషులు ఎవరో తేలాలి శిక్ష పడాలని సునీతా తో పాటు తాము కూడా కోరుకుంటున్నామని ఆమె అన్నారు. సిబిఐ ని కలిసిన సునీతా ఈ లాంటి హత్యలు అనేకం జరుగుతుంటాయి. దీనిపై ఏమిటి మీరు ఇంతగా మాట్లాడుతున్నారు. కేసు గురించి మర్చి పోండి అన్నారని కూడా ఆమె పేర్కొనటం గమనించదగ్గ విషయం .
జగన్ ,షర్మిల మధ్య విభేదాలపై
జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్నా వార్తలపై కూడా ఆమె స్పందించారు. పొరుగు రాష్ట్రాలతో ఇబ్బందులు వద్దనే ఉద్దేశం తోనే జగన్ తెలంగాణాలో కార్యకలాపాలు వద్దని అనుకున్నారని అన్నారు.అదే సందర్భంలో షర్మిల తనకు ఇక్కడే రాజకీయ భవిషత్ ఉంటుందని అభిప్రాయపడుతుందన్నారు. రాజకీయాలలో ఎవరి అభిప్రాయాలూ వారికీ ఉంటాయని ఆమె తెలపటం కొసమెరుపు !!!

Related posts

పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోంది: కృష్ణాబోర్డుకు తెలంగాణ మరో లేఖ!

Drukpadam

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరమైన కేటీఆర్…

Drukpadam

మంత్రిపదవులపై రగులుతున్న ఏపీ … ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా!

Drukpadam

Leave a Comment