Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలి…ఖమ్మంలో అఖిలపక్ష సమావేశం డిమాండ్…

బండి సంజయ్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం బండి సంజయ్ ని వెంటనే అరెస్ట్ చేయాలి బండి సంజయ్ తవ్వకాల వ్యాఖ్యలను ఖండించిన అఖిలపక్ష పార్టీలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

ఖమ్మం,

అధికారంలోకి రావాలనే వ్యామోహంతో బిజెపి మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు చేస్తుందని బండి సంజయ్ *తవ్వకాల వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని అఖిలపక్ష పార్టీల నేతలు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రం అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ (ఎం.ఎల్.) ప్రజాపంథా, సిపిఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ, టి.ఆర్.ఎస్., కాంగ్రెస్, సీపీఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన నేతలు పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వారు కోరారు.

ఉద్దేశ్యపూర్వకంగానే బండి సంజయ్ వ్యాఖ్యలు – సిపిఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సంజయ్ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. సమస్యల ఆధారంగా విమర్శలు రాజకీయాల్లో సహజం కానీ, సమాజ ఐక్యతను దెబ్బతీసే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడంలో బిజెపి ముందు వరుసలో ఉంటుందని దాని పర్యవసానంలో సంజయ్ వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయని అన్నారు* . రాష్ట్రంలో విధానాల ఆధారంగా కాకుండా మతాల మధ్య చిచ్చుపెట్టి విభజన ద్వారా బలపడాలనే వ్యూహంతో బిజెపి పన్నాగాలు పన్నుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి ఆర్.ఎస్.ఎస్. రాజ్యాంగాన్ని తెచ్చేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తుందని అన్నారు. తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా మసీదులు, చర్చిలు, ఇతర మతాలకు చెందిన దేవస్థానాలు ఆధారం చేసుకొని వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. చివరకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కట్టడం తాజ్మహల్ను కూడా వివాదంలోకి తెచ్చారని అన్నారు. 1991లో బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత పార్లమెంట్ ఒక చట్టం చేసిందని తెలిపారు. గుళ్ళు, మసీదులు, ఇంకేవైనా ప్రార్ధనా స్థలాలను విధ్వంసం చేయడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడమనేది రాజ్యాంగ విరుద్ధమంటూ చట్టం చేశారని అన్నారు. బిజెపి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం దేశంలో విభజన తెస్తూ, తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం యత్నిస్తుందన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ప్రజాతంత్రవాదులు, లౌకికవాదులు, ప్రజా సంఘాలు, దేశ శ్రేయస్సు కోరుకునే వారందరు మతతత్వానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.

దేశ సమైక్యతను ప్రమాదంలోకి నెడుతున్న బిజెపి సిపిఐ (ఎం.ఎల్.) ప్రజా పంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశ. సమైక్యతను ప్రమాదంలోకి నెడుతుందని వారు అన్నారు. రోజు రోజుకూ బిజెపి ప్రజలను పన్నుల రూపంలో, అధిక ధరలు పెంచి ప్రజలను పీడిస్తుందన్నారు. మోడీ పాలనలో ధనవంతులు విపరీతంగా ధనం పోగేసుకుంటున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలను బాగు చేయడానికే మోడి. సర్కార్ పని చేస్తుందని అన్నారు. ప్రజలపై భారాలు మోపి దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మతాల మధ్య చిచ్చు పెడుతున్నదని విమర్శించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బిజెపి పని కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఎస్.డి. జావీద్

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రాజకీయ పబ్బం గడుపుకోవడం బిజెపి పని అని వారు అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలను వారు ఖండించారు. బిజెపి బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

అవాస్తవాలను ప్రచారం చేయడమే బిజెపి, ఆర్.ఎస్.ఎస్. లక్ష్యం- సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి

అవాస్తవాలను సైతం ప్రచారం చేయడమే బిజెపి, ఆర్.ఎస్.ఎస్. ప్రధాన లక్ష్యం అని అన్నారు. దేశంలో ప్రజలు అనేక సమస్యలతో బాధ పడుతుంటే, వాటిని పరిష్కారం చేయకుండా మత, ప్రాంతాల మధ్య ఘర్షణ సృష్టించే పనిలో బిజెపి ఉందన్నారు. బండి సంజయ్ మతోన్మాదిగా మారారని, ఆర్.ఎస్.ఎస్., బిజెపి అసలు అజెండాను అమలు పరిచే పనిలో తెలంగాణ బిజెపి నేతలు ఉన్నారని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బిజెపి కి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేద్దాం టి.ఆర్.ఎస్. నగర అధ్యక్షులు కమర్తపు మురళి

భారత రాజ్యాంగాన్ని మార్చి, ఆర్.ఎస్.ఎస్. రాజ్యాంగాన్ని అమలుపర్చాలనే ఉద్దేశ్యంతో బిజెపి పనిచేస్తుందని, దేశంలో మత కల్లోలాలు సృష్టించి, అలజడి రేపి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కల్పి ఐక్య ఉద్యమాలు నిర్వహిద్దామని అన్నారు. వాట్సాప్ యూనివర్శిటీ ద్వారా తప్పుడు వార్తలను బిజెపి ప్రచారం చేస్తున్నారని అన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణలో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.

బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలి.

సిపిఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. సిపిఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు వి.వి. రావు మాట్లాడుతూ బిజెపి దుర్మార్గానికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఉద్యమించాలని వారు తెలిపారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా భవిష్యత్లో ఐక్య ఉద్యమాలు చేపట్టాలని, బండి సంజయ్ పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేసు నమోదు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. ఇప్పటికైనా బిజెపి మతాల మధ్య గొడవలు పెట్టడం మాని, ప్రజా సమస్యలపై కేంద్రీకరించాలని అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి పెరిగిన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో బిజెపికి స్థానం లేదన్నారు. తెలంగాణలో రాచరికానికి వ్యతిరేకంగా మతాలకు అతీతంగా పోరాడిన చరిత్ర ఉందని వక్తలు తెలిపారు. భవిష్యత్లో బిజెపి, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యం ఉద్యమించాలని ప్రజాతంత్రవాదులు, ప్రజలు, కార్మికులు, కర్షకులు కదలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ అఫ్రోజ్ సమీనా, సిపిఎం నేతలు భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాస్, ఎస్. నవీన్ రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, మిక్కిలినేని నరేంద్ర, ముస్తఫా, తాటి వెంకటేశ్వర్లు, విద్యావేత్త ఐ.వి. రమణారావు, నాయకులు అసద్. ఎస్.డి.గౌస్, జబ్బార్, బండి పద్మ, బషీర్, బండారు రమేష్, తిరుపతిరావు, ప్రముఖ వైద్యులు డా. సి. భారవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామన్నారు.. నగరాన్ని మురికికూపంగా మార్చారు: కేసీఆర్, కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

Ram Narayana

ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అమెరికా డాలర్‌: ఉదయ్ కోటక్

Drukpadam

పవన్ కల్యాణ్ అనే నేను అనగానే చప్పట్లు, కేకలతోో మార్మోగిన సభా ప్రాంగణం…

Ram Narayana

Leave a Comment