Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ హై కోర్ట్ సింగల్ జడ్జి స్టేపై డివిజన్ బెంచ్ కి అప్పీల్

ఏపీ హై కోర్ట్ సింగల్ జడ్జి స్టేపై డివిజన్ బెంచ్ కి అప్పీల్
-ఈ రాత్రికి విచారణ జరిపే ఆవకాశం
-కోర్ట్ తీర్పు కోసం ఎదురు చూపులు
ఏపీ హైకోర్టు పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పై ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసింది. అది ఈ రాత్రికి విచారణకు వచ్చే ఆవకాశం ఉంది. కోర్ట్ తీర్పు కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రంగంలో ఉన్న అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదని కనీసం పోలింగ్ కు 4 వారాల ముందు ఎన్నికల ముంచు నుంచి కోడ్ అమలు చేయాలనీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన పాటించలేదని తెలుగుదేశం తరుపున లాయర్లు వాదించారు. వరివాదనలతో ఏకీభవించిన సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపి వేస్తూ సంచలన నిన్నయం తీసికుంది. ఈ నెల 15 లోపు ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలనీ అప్పటివరకు కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.ఇది నిజంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెంపపెట్టు లాంటిదే . డివిజన్ బెంచ్ కు ఎన్నికల సంఘం వెళ్లటంతో ఈ కేసును అత్యవసరంగా భావించిన కోర్ట్ ఈ రాత్రి కి విచారణ జరిపే ఆవకాశం ఉన్నట్లు సమాచారం . పరిషత్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన స్టే ను స్వాగతిస్తున్నామని తెలుగుదేశం ప్రకటించింది. సిపిఐ నారాయణ కూడా దీన్ని స్వాగతించారు. అయితే ఆయన చంద్రబాబు ఎన్నికల భవిష్కరణ నిరణయాన్ని తప్పుపట్టారు. తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts

సర్వదర్శన టోకెన్లకు ఎగబడిన భక్తజనం.. తోపులాట జరిగి పలువురికి గాయాలు

Drukpadam

సర్జికల్ స్ట్రయిక్స్ పై కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్!

Drukpadam

మా చానల్ ఇంకా నడుస్తుండడం ఆశ్చర్యకరమే: ఆఫ్ఘన్ టోలో న్యూస్ అధినేత!

Drukpadam

Leave a Comment