తెలంగాణపై బీజేపీ ఆశలు నెరవేరే అవకాశం ఉందా…?
–అన్నదమ్ముల్లా మెలిగే తెలంగాణ ప్రజలును చీల్చడం సాధ్యమా
–కులాల మతాల మధ్య వైషమ్యాలకు తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా
–పార్టీలను మారే సంస్కృతిని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా
–బండి సంజయ్ దూకుడు ఫలితాలను ఇస్తుందా
బీజేపీ తెలంగాణపై ఆశలు పెట్టుకుంది…తెలంగాణాలో టీఆర్ యస్ పని అయిపోయిందని ప్రజలు తెలంగాణాలో టీఆర్ యస్ ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అదే కాంగ్రెస్ కు సాధ్యం కాదని తామే టీఆర్ యస్ కు ప్రత్యాన్మాయమని చెపుతున్నారు . అయితే నిజంగా బీజేపీకి తెలంగాణాలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ? వారి ఆశలు నెరవేరే అవకాశం ఉందా ? ఇప్పుడు మూడు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ అధికారంలోకి రావాలంటే 60 సీట్లు కావాలి అన్ని సీట్లు గెలుచుకుంటుందా ? ఆ అవకాశాలు తెలంగాణాలో ఉన్నాయా ? అంటే అంత తేలిగ్గా చెప్పే విషయం కాదని అంటున్నారు రాజకీయపండితులు … డబుల్ ఇంజన్ సర్కారు కావాలని బీజేపీ ప్రచారం చేస్తుంది. అంటే కేంద్రం లో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారం లో ఉంటె అభివృద్ధి ఉరుకులు పెడుతుందని అంటున్నారు . అంటే వేరే పార్టీలు రాష్ట్రాలలో అధికారం లో ఉంటె తమ ప్రభత్వం సహకరించిందని కుండబద్దలు కొడుతున్నారు . ఇదెక్కడి ప్రజాస్వామ్యమో బీజేపీ నే చెప్పాలి … కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు విషయంలోనూ వివక్ష , పక్షపాతం ఉందని ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు . అది నిజమే అన్నట్లు బీజేపీ వ్యవహారం ఉంది .
2024 రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఏ చిన్న అవకాశం దొరికినా, టీఆర్ యస్ పై దాడికి పూనుకుంటుంది… తమ విధానాలను చెప్పడం ద్వారా కాకుండా , కులాలమధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం ద్వారా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలనే లక్ష్యం తో ముందుకు సాగుతుందని బీజేపీపై ఆరోపణలు ఉన్నాయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలు తాము అధికారంలోకి రావడానికి దోహదపడతాయని నమ్ముతుంది…. అందువల్లనే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రాన్ని తరుచు సందర్శిస్తున్నారు ….కేంద్ర హోమ్ మంత్రి , అమిత్ షా తురకగూడలో జరిగిన బహిరంగసభకు వచ్చారు . ముస్లింపై విమర్శలు కురిపించారు. వారికీ ప్రభుత్వం ఇస్తున్న రిజర్వేషన్ లు బీజేపీ అధికారం లోకి వస్తే రద్దు చేస్తామని అన్నారు . కేసీఆర్ నవాబ్ తో పోల్చారు . పైగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు టీఆర్ యస్ సమర్థించినప్పటికీ సమర్థించలేదని ఆరోపణలు గుప్పించారు . దీనిపై టీఆర్ యస్ మండిపడింది. లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామ అమిత్ షా మాటలపై స్పందించారు . తాను పార్లమెంట్ లో జరిగిన చర్చలో పాల్గొని కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దును సమర్థించడంతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను కూడా భారత్ లో భాగంగానే గుర్తించాలని చెప్పినప్పుడు అమిత్ షా పార్లమెంట్ లోనే ఉన్న విషయాన్నీ గుర్తు చేశారు . అమిత్ షా లాంటి పెద్ద నాయకుడు అబద్దాలు మాట్లాడటం సరికాదని అన్నారు . దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్లు రాకపోవడంతో నామ విమర్శ నిజమే అనిపిస్తుంది.
తెలంగాణాలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అధికారం లోకి బీజేపీ రావాలంటే కనీసం 60 బీజేపీగాని దాని మిత్రపక్షం గాని గెలుచుకోవాలి …ఇప్పటివరకు బీజేపీకి రాష్ట్రంలో మిత్రులు ఎవరు లేరు . ముందుముందు వస్తే గిస్తే పవన్ కళ్యాణ్ జనసేన మిత్ర పక్షంగా ఉండే అవకాశం ఉంది. కానీ అన్ని సీట్లు రెండు పార్టీలకు కలిసి వస్తాయా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసాధ్యమనే చెప్పాలి …అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నాయకులూ అందునా టీఆర్ యస్ ఉన్న నాయకులూ చేరితే అవకాశం ఉంటుందని బీజేపీ లెక్క కావచ్చు …
కానీ ఉమ్మడి జిల్లాలలో హైద్రాబాద్ , రంగారెడ్డి , మహబూబ్ నగర్ .కరీంనగర్ ,నిజామాబాద్, మెదక్ లాంటి ఆరు జిల్లాల్లో మాత్రమే బీజేపీకి గట్టిగా ప్రయత్నం చేస్తే కొన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లోబోణి కొట్టే అవకాశం కూడా లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. అలాంటి బీజేపీ అధికారంలోకి వస్తుందా ? అనే సందేహాలు ఉన్నాయి. పైగా డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు . కేంద్రంలో బీజేపీ తిరిగి వస్తుందా ? వస్తుందే అనుకున్నా గతంలోలాగా సంపూర్ణ మెజార్టీ సాధ్యమేనా అనే సందేహాలు లేకపోలేదు .. అందువల్ల బీజేపీ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తేగలుగుతుంది…కాంగ్రెస్ ,టీఆర్ యస్ నుంచి ఎంతమంది ముఖ్యనేతలు బీజేపీలో చేరతారు అనేదానిపైనా ఆధారపడి ఉంటుంది. చూద్దాం బీజేపీ వ్యూహాలు ,ఎత్తుగడలు ఏమిటో మరి !