Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ నిర్ణయం సరైందే నని హై కోర్ట్ తీర్పు తో రుజువైంది … చంద్రబాబు

టీడీపీ ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైనదేనని హైకోర్టు తీర్పుతో రుజువైంది: చంద్రబాబు
06-04-2021 Tue 17:57
  • ఏపీలో ఎన్నికల ప్రక్రియ నిలిపివేత
  • స్టే ఇచ్చిన హైకోర్టు
  • వైసీపీ సర్కారుకు చెంపపెట్టు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు
  • ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయమని వెల్లడి
Chandrababu responds on High Court verdict

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. పరిషత్ ఎన్నికల నిలుపుదల రాజ్యాంగ విజయం అని అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సరైనదేనని రుజువైందని వెల్లడించారు. ఎస్ఈసీ చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని, ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని చంద్రబాబు హితవు పలికారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఏడాది దాటిందని, కొత్త ఓటర్లకు కూడా అవకాశం ఇచ్చేలా తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఎన్నికల కోడ్ వ్యవధి నాలుగు వారాలు ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని, అయితే, సుప్రీం మార్గదర్శకాలను పట్టించుకోకుండా హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఎస్ఈసీని ప్రభుత్వం రబ్బరుస్టాంపుగా మార్చిందని విమర్శించారు. సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని జవహర్ డిమాండ్ చేశారు.

Related posts

ఇకపై కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు: పెద్దిరెడ్డి!

Drukpadam

ఈటల బీజేపీ చేరిక ఆయన వ్యక్తిగత నిర్ణయం :కోదండరాం…

Drukpadam

బెంగళూరుకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌!

Drukpadam

Leave a Comment