Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హోంమంత్రి మనవడే కేసులో ఉన్నాడు.. కేటీఆర్ చర్యలు తీసుకోండి: కేంద్ర మాజీ మంత్రి

అమ్నీషియా పబ్ కేసుకు సంబంధించి తెలంగాణ సర్కార్‌పై విపక్షాల నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ రేణుకా చౌదరి స్పందించారు. మైనర్లకు పబ్బుల్లోకి అనుమతి ఎలా ఇస్తారని నిలదీశారు. మైనర్లకు పబ్బుల్లోకి అనుమతినివ్వడంపై ముందుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అన్ని దేశాల కల్చర్ తేవడం కాదు.. ముందు అమ్మాయిలకు రక్షణ ఇవ్వాలన్నారు. పబ్బులు నిబంధన పాటించేలా చూడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్లు చేసుడు కాదు.. యాక్షన్ తీసుకోవాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. మైనర్‌పై జరిగిన గ్యాంగ్ రేప్‌పై హైకోర్టులో.. లేదంటే సుప్రీంకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు సీజే స్పందించాల‌ని.. సుమోటోగా స్వీకరించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. హోంమంత్రి మనవడే ఈ కేసులో ఉన్నారని ఆరోపించారు. ఇన్నోవా వాహనం ఎవరిది అనేది తేలాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. కేసు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని అనుకుంటే.. సీబీఐ విచారణకు ఆదేశించాలని రేణుకా చౌద‌రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి మీదనే ఆరోపణలు వస్తే.. సీబీఐ విచారణ ఎందుకు చేయట్లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆమె కోరారు.

Related posts

ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయంలో ఆందోళన

Ram Narayana

వివేకా కేసులో సిబిఐ చెత్త విచారణ …సజ్జల ఆరోపణలు…

Ram Narayana

ఈటలకు కేంద్ర భద్రత.. వై కేటగిరీ భద్రత కల్పించే అవకాశం..?

Drukpadam

Leave a Comment