Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంబటి రాంబాబే పెద్ద వస్తాదు: కన్నా లక్ష్మీనారాయణ

  • అంబటి రాంబాబే పెద్ద వస్తాదు: కన్నా లక్ష్మీనారాయణ
  • -సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా కన్నా నియామకం
  • -మొదలైన మాటల యుద్ధం
  • -వస్తాదు అంటూ అంబటి పేర్కొనడంపై కన్నా అభ్యంతరం
  • -ఇద్దరం 1989లో ఎమ్మెల్యే అయ్యాం.. ఏంటి తేడా? అంటూ వ్యాఖ్యలు

ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారో లేదో మాటల యుద్ధం మొదలైంది. వస్తాదు అంటూ అంబటి రాంబాబు పేర్కొనడంపై కన్నా స్పందించారు. 

ఆయన భాష ఏంటో  తనకు అర్థం కావడంలేదని అన్నారు. అంబటి రాంబాబు 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారని, తాను కూడా 1989లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని వివరించారు. ఇక ఇద్దరికీ ఏంటి తేడా? అని ప్రశ్నించారు. అంబటి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మంత్రిగా ఉన్నారు… ఆయనకంటే పెద్ద వస్తాదు ఇంకెవరున్నారు? అని అంటూ కన్నా వ్యాఖ్యానించారు. 

టీడీపీ హైకమాండ్ తనకు సత్తెనపల్లి టికెట్ ఇస్తే, ఎన్నికల్లో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని తెలిపారు. తాను సత్తెనపల్లి నుంచి బరిలో దిగడానికి ఓ కారణం ఉందని, ఎన్నికలు ప్రకటించాక ఆ కారణం ఏంటో చెబుతానని కన్నా వెల్లడించారు. 

గతంలో తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని, ఆ సమయంలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో సగభాగమే సత్తెనపల్లి అని, తనకు సత్తెనపల్లి నియోజకవర్గం కొత్తేమీ కాదని వివరించారు.

Related posts

భారత్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించిన చైనా… 

Drukpadam

 9 సెకన్లలో కూలన సూపర్‌టెక్ ట్విన్ టవర్స్.. ఆసక్తికర అంశాలు ఇవే!

Drukpadam

బిచ్చగత్తెగా మరీనా బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ మరదలు!

Drukpadam

Leave a Comment