Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు కరకట్ట నివాసం జఫ్తుపై ముగిసిన వాదనలు.. జూన్ 2న తీర్పు!

చంద్రబాబు కరకట్ట నివాసం జఫ్తుపై ముగిసిన వాదనలు.. జూన్ 2న తీర్పు!

  • కరకట్టపై చంద్రబాబు నివాసం జఫ్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ పిటిషన్
  • నీకిది-నాకిది మార్గంలో లింగమేని నుండి  గెస్ట్ హౌస్ పొందినట్లు అభియోగం
  • ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం జఫ్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి బిందుమాధవి ఇరువైపుల వాదనలు విన్నారు. జూన్ 2న తీర్పును వెలువరించనున్నారు.

ఏం జరిగింది?

కరకట్టపై చంద్రబాబు ఇల్లు జఫ్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ హయాంలో సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌లలో లింగమనేనికి  లబ్ధి చేకూర్చారని, దానికి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్ గా చంద్రబాబు పొందినట్లు సీఐడీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఇంటి జఫ్తుకు అనుమతి కోరింది సీఐడీ. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి ఎల్లుండి తీర్పు వెలువరించనున్నారు.

Related posts

హెచ్ ఆర్ సి ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని అధికార్లను ప్రాసిక్యూట్ చేయాలి…

Drukpadam

చిన్న కళ్లతో ఉపయోగాలు చెప్పిన నాగాలాండ్ మంత్రి.. 

Drukpadam

వై నాట్ పులివెందుల అంటున్న బాబు లేదా పవన్ కు ఆహ్వానం …పేర్ని నాని ..

Drukpadam

Leave a Comment