Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆత్మ‌కూరు ఉప ఎన్నికల బ‌రిలో 28 మంది!

ఆత్మ‌కూరు ఉప ఎన్నికల బ‌రిలో 28 మంది!
గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో ఆత్మ‌కూరుకు ఉప ఎన్నిక‌
వైసీపీ అభ్య‌ర్థిగా గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు విక్ర‌మ్ రెడ్డి నామినేషన్‌
నామినేష‌న్ల‌కు సోమ‌వారంతో ముగిసిన గ‌డువు
చివ‌రి రోజున దాఖ‌లైన 13 నామినేష‌న్లు
మొత్తంగా 28 నామినేష‌న్లు దాఖ‌లైన‌ట్లు అధికారుల వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అత్యధికంగానే నామినేషన్లు దాఖలయ్యాయి . సోమవారం చివరి రోజు కావడంతో ఒక్కరోజులోనే 13 నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నియోజకవర్గంలోని 28 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు .మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ ఈసారి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసిపి తన అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రంగంలోకి దిగిన విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి ఇక్కడ పోటీ చేస్తామని ప్రకటించడంతో పోటీ అనివార్యమైంది .తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లు మరణించిన స్థానంలో పోటీపెట్టకూడదనే పార్టీ నిర్ణయం మేరకు పోటీకి దూరంగా ఉంది. జనసేన తన అభిప్రాయాన్ని వెల్లడించలేదు అయితే బీజేపీ తో జనసేన పొత్తులో ఉన్నందున దానికి తన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆత్మకూరు బరిలో 28 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఎంత మంది భార్యలు ఉంటారు అనేది తేలాల్సి ఉంది.

గుండెపోటుతో మృతి చెందిన‌ దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అసెంబ్లీ స్థానం ఆత్మ‌కూరు ఉపఎన్నిక బరిలో దిగేందుకు ఏకంగా 28 మంది అభ్య‌ర్ధులు సిద్ధమ‌య్యారు. ఈ ఎన్నిక‌లో అధికార పార్టీ నుంచి గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి నామినేష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో చ‌నిపోయిన నేత‌ల కుటుంబ స‌భ్యుల‌కే టికెట్ ఇస్తే పోటీ చేయ‌రాద‌న్న సంప్ర‌దాయాన్ని గౌర‌వించిన టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది.

ఇక విక్ర‌మ్ రెడ్డితో పాటు ఇప్ప‌టికే చాలా మంది ఈ ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. సోమ‌వారం నామినేష‌న్ల గ‌డువుకు చివ‌రి రోజు కావడంతో ఈ ఒక్క‌రోజే ఏకంగా 13 మంది అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేశారు. వెర‌సి ఈ ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టిదాకా 28 నామినేష‌న్లు దాఖ‌లైనట్లైంది. అయితే నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగిసేలోగా వీరంతా బ‌రిలోనే నిలుస్తారా? త‌ప్పుకుంటారా? అన్న‌ది తేలాల్సి ఉంది.

Related posts

కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కు స్పందన…వరద భాదితులకు అండగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర!

Drukpadam

ఖమ్మం నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు…

Drukpadam

కేసీఆర్ సారు జర్నలిస్టుల గోడు వినండి మీరు ….

Drukpadam

Leave a Comment