బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి ఇంకా 9194 ఎలక్ట్రోల్ కాలేజీ ఓట్లు అవసరం!
జగన్ , నవీన్ పట్నాయక్ ఓట్లు కీలకం
ఇప్పటికే బీజేపీకి జై కొట్టిన జగన్
జగన్ బాటలో నవీన్ పట్నాయక్
జులై 25 న కొత్త రాష్ట్రపతిగా ఎవరు భాద్యతలు స్వీకరిస్తారు ? బీజేపీ వ్యూహం ఏమిటి ? ప్రతిపక్షాలు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాయనేది నేడు ఆశక్తిగా మారింది. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామనాథ్ కోవింద్ కు మరో మరు ఆవకాశం ఇస్తారనే ప్రచారం కూడా జరిగిన అలంటి ఆలోచలను ఏమి లేవనే సంకేతాలు బీజేపీ నుంచి వస్తున్నాయి. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కు అవకాశం పై కూడా చర్చలు జరిగాయి .కానీ దానికి కూడా అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇద్దరు ఎస్టీ మహిళల పేర్లు ప్రముఖంగా ప్రచారం లో ఉన్నాయి. వారిలో ఒడిశా కు చెందిన ద్రౌపది ముర్ము , మధ్యప్రదేశ్ కు చెందిన అనసూయ పేర్లు వినిపిస్తున్నాయి.. అయితే అయితే ఇప్పుడు వినిపిస్తున్న పేర్లే ఉంటాయా తెరపైకి అనూహ్యంగా మరో పేరు వస్తుందా అనేది కూడా ఉంది. .. బీజేపీ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే మరో 9,194 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బిజెపి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమాలోచనలు బీజేపీ హైకమాండ్ చేస్తుంది. అభ్యర్థి ఎంపిక పై ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాలు అనేక పర్యాయాలు సమావేశాలు జరిపినట్లు తెలుస్తుంది. పార్టీ అభ్యర్థి నెగ్గాలంటే బీజేపీ ఎన్ డి ఏ పక్షాల ఓట్లతో పాటు మరికొన్ని ఓట్లు అవసరం అవుతాయి. మొత్తం ఎలక్ట్రోల్ కాలేజీ ఓట్ల 10,98,903 ఓట్లు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనందున ఆరాష్ట్ర జనాభా ప్రకారం ఉన్న 6,264 ఉండగా వాటిని సస్పెండ్ చేశారు . అందువల్ల రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే 5,46,320 అవసరం …కానీ బీజేపీకి 4,65,799 ఓట్లు ఉన్నాయి. మిత్రులకి మరో 71,329 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ డి ఏ ఓట్లు 5,37,329 ఓట్లు …ఇంకా 9,194 ఓట్లు తక్కువగా ఉన్నాయి. అందువల్ల జగన్ ,నవీన్ పట్నాయక్ సహకారం తప్పని సరి అయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ , ఒడిశా ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నాయి. అందువల్ల వారి ఓట్లు కూడా కలిస్తే బీజేపీ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది.
రామ్నాథ్ కోవింద్ వారసుడుగా ఎవరు ఉండాలి? ఎవరిని పెడితే ఉపయోగం ఉంటుంది… అనే విషయంపై ప్రదాని నరేంద్ర మోడీ సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ నాయకులతో జేపీ నడ్డా ఎప్పటికప్పుడు వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. బిజెపి అభ్యర్థి రాష్ట్రపతి మరో 9,154 ఓట్లు కావాల్సి ఉంది అందుకోసం ఎవరి సహాయం తీసుకోవాలి అని దానిపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి పిలిపించుకొని స్వయంగా ప్రధాని 45 నిమిషాలు భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిని బలపరచాలని ప్రదాని కోరగా అందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం . అదేవిధంగా నవీన్ పట్నాయక్ కూడా బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో తేలిగ్గానే బీజేపీ నిర్ణయించే అభ్యర్థే రాష్ట్రపతి పీఠం అధిరోహించనున్నారు ….