హైదరాబాద్ గ్యాంగ్ రేప్‌పై మహిళా కమిషన్ దర్యాప్తు… తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసులు!
-ఆమ్నేషియా పబ్ వద్ద బాలికను అపహరించిన నిందితులు
-కారులోనే ఆమెపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్
-ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్
-సికింద్రాబాద్ రేప్‌పైనా విచారణ మొదలెట్టినట్టు మహిళా కమిషన్ ప్రకటన
హైదరాబాద్ గ్యాంగ్ రేప్ ఘటనపై విచారణ జరిపేందుకు మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఇప్పటివరకు గ్యాంగ్ రేపు కు సంబంధించిన దోషులను అరెస్టు చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మహిళా కమిషన్ దీనిపై దృష్టి సాధించటం చర్చనీయాంశమైంది. మహిళా కమిషన్ సభ్యులు హైదరాబాద్ లో జరిగిన గ్యాంగ్ రేప్ విషయాలు వాటి పూర్వాపరాలను పాల్గొన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖ దీనిపై సమగ్ర విచారణ కోసం రంగంలోకి దిగిన విషయం విధితమే. అయితే ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీలు గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. మహిళా సంఘాలు యువజన విద్యార్థి సంఘాలు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. డీజీపీ సైతం ముట్టడించేందుకు ప్రజాసంఘాలు ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా వారిపై కుక్కల కార్యాలయాన్ని యువజన విద్యార్ధి సంఘాలు ముట్టడించేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు వమ్ము చేశారు ముట్టడికి వచ్చిన వారిపై కుక్కలను ఉసిగొల్పి వారిని అరెస్ట్ చేయడంపై విమర్శలు ఉన్నాయి. గ్యాంగ్ రేప్ సంఘటన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున చర్చలకు, విమర్శలకు దారి తీసింది . ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టడం ఆశక్తిగా మారింది.
ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్‌పై జాతీయ మహిళా కమిషన్ కూడా దృష్టి సారించడంతో కదలికలు ప్రారంభం అయ్యాయి. పబ్ వద్దకు వచ్చిన ఓ మైనర్ బాలికను కారులో ఎక్కించుకున్న ఐదుగురు యువకులు కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు ఆందోళన వ్యక్తం చేయడంతో ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అసలు దోషులను పోలీసులు కాపాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపైనా విచారణ మొదలుపెట్టినట్టు మహిళా కమిషన్ ప్రకటించింది.