ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రమోషన్… బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా నియామకం!
-పోలీసు ఉద్యోగానికి స్వస్తి పలికిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-బీఎస్పీతో రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన వైనం
-బీఎస్పీ తెలంగాణ కన్వీనర్‌గా కొనసాగుతున్న ఆర్ఎస్పీ
-తాజాగా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియామకం
-రేపు కొత్త బాధ్యతలు చేపట్టనున్న మాజీ పోలీసు అధికారి
తెలంగాణ రాష్టంలో ఐపీఎస్ అధికారిగా ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఆ పదవికి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక పార్టీలు ఆఫర్లు ఇచ్చినప్పటికీ భావుజన సమాజావాది పార్టీ లో చేరారు . తెలుaగు రాష్ట్రాలలో ఆపార్టీకి పెద్దగా ఉనికి లేనందువల్ల ఆయన వెంచుకున్న మార్గం పై కొందరు పెదవి విరిచారు. మరికొందరు హితులు ,సన్నిహితులు తన నిర్ణయాన్ని ఆలోచించుకోమని చెప్పారు . తన బాట పూలబాట కాదని మూళ్ళ బాట అని తెలిసినప్పటికీ ఆయన బావుజనుల బాగుకోసం బీఎస్పీ నే సరైన వేదిక అని నమ్మి అధినేత్రి మాయావతిని కలిసి తన మనసులో మాట చెప్పారు . అందుకు ఆమె ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా నియమించింది. నాటి నుంచి ఆయన నిర్విరామంగా రాష్ట్ర పర్యటన చేస్తున్నారు . ప్రధానంగా దళితవాడల్లో పర్యటిస్తూ వారిని చెతన్యపరుస్తున్నారు కొద్దిరోజుల్లోనే దక్షిణాదిన దొరికిన ఒక కీలక నేతగా భావుజనాల బాగుకోరే గొప్పనాయకుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ సేవలు మరింతగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యం తో తెలంగాణ కు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది. ఆయన రేపు భాద్యతలు స్వీకరించనున్నారు .
ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రమోషన్ రావడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . రాజకీయాల్లోకి వస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరిన ఆయనను పార్టీ అధినేత్రి మాయావతి నాడు తెలంగాణ శాఖకు కన్వీనర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హోదాలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో పాదయాత్ర చేపడుతున్నారు.
ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రమోషన్ కల్పిస్తూ బీఎస్పీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్పీ తెలంగాణ శాఖకు ఆయనను అధ్యక్షుడిగా నియమించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీగా కొనసాగుతున్న ఆ పార్టీ ఎంపీ రాంజీ గౌతమన్ హాజరుకానున్నారు.