Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి ఇంట కేటీఆర్ లంచ్ … పాల్గొననున్న మంత్రి పువ్వాడ!

పొంగులేటి ఇంట కేటీఆర్ లంచ్ … పాల్గొననున్న మంత్రి పువ్వాడ!
ఖమ్మం టీఆర్ యస్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమా…?
అసమ్మతినేతలను నేతలను కలుపుకుపోయే ప్రయత్నమా ?
లంచ్ కు హాజరు కానున్న ఎంపీలు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు

ఖమ్మం టీఆర్ యస్ లో అసమ్మతి నాయకుడుగా ముద్రపడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట లంచ్ కు శనివారం ఖమ్మం వస్తున్న మంత్రి కేటీఆర్ వస్తున్నారు. ఇది టీఆర్ యస్ ఖమ్మం రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతమా ? అసమ్మతి నేతలను కలుపుకునే పోయే దానిలో భాగమా? అనేది ఆశక్తిగా మారింది… గతంలోనే ఖమ్మం పర్యటనలో పొంగులేటి ఇంటికి లంచ్ కు కేటీఆర్ రావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలవల్ల ఖమ్మం కేటీఆర్ పర్యటన వాయిదాపడింది. చాలాకాలం తరువాత మంత్రి ఖమ్మం వస్తున్నారు . ఈ సందర్భంగా మాజీఎంపీ టీఆర్ యస్ నాయకుడు పొంగులేటి నివాసంలో భోజన ఏర్పాట్లు చేయాలనీ కోరినట్లు సమాచారం . అందుకు అంగీకరించిన పొంగులేటి ఏర్పాట్లు చేస్తున్నారు . లంచ్ మీట్ కు కూడా రాజకీయ కారణం ఉందని అంటున్నారు .

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో ప్రజాసంబంధాల కలిగిన నాయకుడిగా ఉన్నారు … టీఆర్ యస్ లో బలమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో అనివార్య కారణాల వల్ల సీటింగ్ ఎంపీ గా ఉన్న ఆయనకు సీటు ఇవ్వలేదు . తరువాత రాజ్యసభ ఇస్తామన్న అది జరగలేదు . అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో జిల్లా కు చెందిన కొందరు నాయకులకు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ సైతం ఇవ్వడంలేదు . అందులో పొంగులేటి ఒకరు … అయితే ఆయనకు కేటీఆర్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. తరుచు కేటీఆర్ ని పొంగులేటి కలుస్తున్నారు . అందువల్ల పొంగులేటి పార్టీ మార్పు పై అనేక సందర్భాల్లో వార్తలు వచ్చిన తనకు కేటీఆర్ పై నమ్మకం ఉందని అందువల్ల పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని చెపుతుంటారు . రాజ్యసభ ,లేదా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారంలోకి వచ్చిన సీటు రాలేదు .ఆయనకూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నారు . అందువల్ల ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఉన్న పొంగులేటిని వాదులు కునేందుకు జిల్లా మంత్రి పువ్వాడ గాని,కేటీఆర్ గాని సిద్ధంగా లేరు. జిల్లాలో పొంగులేటిని సేవలు ఉపయోగించుకోవడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు పొందవచ్చునని కూడా ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అందువల్ల లంచ్ మీట్ ద్వారా జిల్లాలో జరుగుతున్నా అసమ్మతి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన మంత్రి అజయ్ పొంగులేటి ఇంట లంచ్ ఏర్పాటుకు వ్యూహం రచించారని విశ్వసనీయ సమాచారం … లంచ్ మీట్ కు కేటీఆర్ తోపాటు అజయ్ , ఎంపీల నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవిచంద్ర కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. నామ జిల్లాలోనే ఉన్నారు . ఇక వద్దిరాజు ఎంపీ అయిన తరువాత ఖమ్మం రాలేదు అందువల్ల ఆయన మంత్రి టూర్ లో పాల్గొనేది లేనిది నిర్దారణ కాలేదు ….

 

Related posts

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి …టీడీపీ నేత చంద్రబాబు!

Drukpadam

దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరతపై కేరళ సీఎం ఆందోళన:కేంద్రంపై వత్తిడికి కలిసి రావాలని11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ…

Drukpadam

రేవంత్ రెడ్డి లక్ష్యంగా టీఆర్ యస్ మాటల దాడి…కాంగ్రెస్ ప్రతిదాడి !

Drukpadam

Leave a Comment