Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

లౌకిక, ప్రజాస్వామిక వాదులు రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏకం అవ్వాలి:భట్టి

లౌకిక, ప్రజాస్వామిక వాదులు రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏకం అవ్వాలి:భట్టి
-రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు ఏకంకావాలి
-బీజేపీ యేతర పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి
-భారత రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్రలు
-దాన్నితిప్పికొట్టే సమయం ఆసన్నమైంది

దేశభక్తులు, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామ్యం కావాలనుకునేవారు ఐక్యం కావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు .
ఆర్ ఎస్ ఎస్ భావజాలం, మనువాదం మతతత్వం కోరుకునేవారు బిజెపి వైపు
దేశంలోని రాజకీయ పార్టీలు ఎటువైపు ఉంటాయో ఈ ఎన్నికలతో తేలిపోతుంది భట్టి విక్రమార్క అన్నారు .

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, ఆర్ఎస్ఎస్, బిజెపి భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఒక వేదికగా ఏర్పడి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికలతో దేశంలో లౌకిక వాదులు, ఆర్ఎస్ఎస్ వాదులు ఎవరో స్పష్టంగా తేలిపోతుందని వివరించారు.

శుక్రవారం ఎర్రుపాలెం మండలం రాజుల దేవరపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం దేశభక్తులు, రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు, ప్రజాస్వామికవాదులు సెక్యులర్ కూటమిగా ఏర్పడాలన్నారు. ఆరెస్సెస్ భావజాలం, మతతత్వం, మనువాదం కావాలని కోరుకునేవారు బీజేపీ కూటమిలో ఉంటారన్నారు. దేశంలోని ఇప్పుడు ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సెక్యులర్ వైపా? ఆర్ఎస్ఎస్, హిందుత్వ వైపా? ఎటువైపు ఉంటాయో తేల్చుకోవాల్సిన సమయం ఏర్పడిందన్నారు . భారత రాజ్యాంగాన్ని మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడిన మనువాదాన్ని రాజ్యాంగంగా తీసుకురావడం కోసం బిజెపి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడానికి ఇప్పుడు జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలను మంచి అవకాశంగా తీసుకొని బిజెపి యేతర సెక్యులర్, ప్రజాస్వామిక పార్టీలు భారత రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్న ప్రతిపక్షాలు శక్తివంతమైన అభ్యర్థిని నిలబెట్టి ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లౌకిక, ప్రజాస్వామిక రాజకీయ పార్టీలు ముందుకు రాకుంటే ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలానికి బిజెపి మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక పార్టీలు ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో లౌకిక వాదాన్ని బలహీనపరిచి ఆరెస్సెస్ భావజాలాన్ని పెంపొందించాలన్న కుట్రలో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షపూరితంగా సెక్యులర్ పార్టీయైన కాంగ్రెస్ ను అనగా తొక్కుతుందని దుయ్యబట్టారు. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. లౌకిక వాదానికి కట్టుబడి భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకై కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రపతి ఎన్నికలను అవకాశంగా తీసుకొని బిజెపికి బుద్ధి బుద్ధి చెబుతుందని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సిరెడ్డి, నాగిరెడ్డి, బోసు, భాష తదితరులు ఉన్నారు.

Related posts

నిన్న కాంగ్రెస్ లో చేరిక నేడు రాజీనామా..డి .శ్రీనివాస్ విషయంలో ట్విస్ట్!

Drukpadam

అసదుద్దీన్ ఒవైసీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత.. కేంద్రం నిర్ణయం !

Drukpadam

శత్రువులను నమ్మవచ్చు కానీ ద్రోవులను నమ్మకూడదు …తుమ్మల సంచలనం వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment