Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సముద్రంలో కొట్టుకుపోయి.. ఇటలీలో కర్నూలు విద్యార్థి మృతి!

సముద్రంలో కొట్టుకుపోయి.. ఇటలీలో కర్నూలు విద్యార్థి మృతి!

  • మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న దిలీప్
  • కోర్సు పూర్తయిన ఆనందంలో బీచ్‌కు 
  • ఒడ్డున కూర్చున్న అతడిని సముద్రంలోకి లాక్కెళ్లిన అలలు
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు

ఎన్నెన్నోఎన్నో ఆశలతో ఆకాంక్షలతో పై చదువులు చదివి తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని వారికీ చేదోడువాదోడుగా ఉండాలని భావించిన కర్నూల్ కు చెందిన దిలీప్ ఉన్నత చదువులకోసం ఇటలీ వెళ్ళాడు . అక్కడ తన ఎం ఎస్సీలో అగ్రికల్చర్ పూర్తీ చేశారు . రేపో మాపో ఉద్యోగం … తన కుటుంబాన్ని ఉన్నత శిఖరాల పై నిలబెట్టాలనే పట్టుదల తో ఉన్న దిలీప్ ఆనందం కోసం సముద్రపు ఒడ్డున కూర్చొని కలలు కంటున్నారు . వస్తూపోతున్న అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . ఒక్కసారిగా అతనిపైకి వచ్చిన పెద్ద అల దిలీప్ ను నీళ్ళలోకి లాక్కుపోయింది. వెంటనే అక్కడ ఉన్న కాస్ట్ గార్డ్ ఆయన్ను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయం కర్నూల్ ఉన్న వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు .

ఉన్నత చదువుల కోసం ఇటలీ వెళ్లిన కర్నూలు యువకుడు సముద్రంలో పడి మృతి చెందాడు. దీంతో కర్నూలులో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక బాలాజీనగర్‌లోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్ద కుమారుడు దిలీప్ (24) ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతున్నాడు. 2019 సెప్టెంబరులో మిలాన్ వెళ్లిన దిలీప్ గతేడాది ఏప్రిల్‌లో కర్నూలు వచ్చాడు. సెప్టెంబరులో తిరిగి వెళ్లాడు. కోర్సు పూర్తి కావడంతో ఉద్యోగం సంపాదించి కర్నూలు వస్తానని ఇటీవల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు.

పీజీ పూర్తయిన సంతోషంలో శుక్రవారం మాంటెరుస్సో బీచ్‌కు వెళ్లాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో ఏమరపాటున ఒడ్డున కూర్చున్న దిలీప్‌ను అలలు లాక్కెళ్లాయి. వెంటనే అప్రమత్తమైన కోస్టుగార్డు సిబ్బంది రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో అతడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts

తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు…మంత్రి పువ్వాడ అజయ్

Drukpadam

ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నేలకొండపల్లి ఎస్ ఐ స్రవంతి..

Drukpadam

కర్ణాటక ఫలితాల్లో 1957 నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ!

Drukpadam

Leave a Comment