Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సిగరెట్ బాక్స్ పై కాదు.. కెనడాలో ప్రతీ సిగరెట్ పై హెచ్చరిక! 

సిగరెట్ బాక్స్ పై కాదు.. కెనడాలో ప్రతీ సిగరెట్ పై హెచ్చరిక !

  • ‘ప్రతీ పఫ్’ లో విషం అంటూ హెచ్చరిక
  • ప్రతిపాదనపై మొదలైన సంప్రదింపులు
  • 2023 ద్వితీయ భాగం నుంచి అమల్లోకి తెచ్చే యోచన
  • ప్రస్తుత హెచ్చరికలు ఉనికిని కోల్పోయయాన్న కెనడా మంత్రి బెన్నెట్

కెనడా కొత్త ట్రెండ్ సృష్టించనుంది. ప్రతీ సిగరెట్ పై ప్రింటెడ్ వార్నింగ్ (అక్షరాలతో రాసిన హెచ్చరిక) ను అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల బాక్స్ లపై ఫొటో, సమాచారంతో కూడిన హెచ్చరికలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. కానీ, సిగరెట్లు తాగే వారు ఎవరూ ఈ దృశ్యాలను చూసి అలవాటు మానుకున్న దాఖలాలు లేవు.

దీంతో మార్పు కోసం కెనడా కొత్త ఆలోచన చేసింది. ‘‘ఈ సందేశాలు వాటి కొత్త దనాన్ని కోల్పోయాయి. అవి ప్రభావాన్ని కోల్పోయాన్నదే మా ఆందోళన’’అని కెనడా ఆరోగ్య మంత్రి కరోలిన్ బెన్నెట్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

‘‘ఆరోగ్య హెచ్చరికలను విడిగా ప్రతి పొగాకు ఉత్పత్తిపై ముద్రించడం వల్ల ప్రజలకు సరైన సందేశం చేరడానికి సాయపడుతుంది’’అని బెన్నెట్ చెప్పారు. శనివారం నుంచి ఈ ప్రతిపాదనపై సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. 2023 ద్వితీయ భాగం నుంచి కొత్త నిబంధన అమల్లోకి తీసుకురావాలన్నది కెనడా సర్కారు యోచనగా ఉంది. ‘ప్రతీ పఫ్ లో విషం’ అన్న సందేశం రాయాలన్నది ప్రస్తుత ప్రతిపాదనగా బెన్నెట్ తెలిపారు.

Related posts

జర్నలిస్టుల ఇళ్లస్థలాలు …హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలి …టీయూడబ్ల్యూ జె ( ఐజేయూ ) డిమాండ్ …

Drukpadam

అనుమతులు లేని ప్రాజెక్టులు తక్షణం ఆపండి …కృష్ణా నది యాజమాన్య బోర్డు!

Drukpadam

నేను ఆ మాట చెపితే కృష్ణగారు నవ్వేశారు: ముఖ్యమంత్రి కేసీఆర్!

Drukpadam

Leave a Comment