Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వంగవీటి రాధా-వల్లభనేని వంశీ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!

వంగవీటి రాధా-వల్లభనేని వంశీ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!
-ఆత్కూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వంశీ, రాధా
-ఏకాంతంగా మాట్లాడుకున్న నేతలు
-రాధాను దగ్గరుండి కారు ఎక్కించి పంపిన వంశీ
-రాధా తనకు మంచి మిత్రుడన్న గన్నవరం ఎమ్మెల్యే

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా నిన్న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఉంగుటూరు మండలంలోని ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరూ పరస్పరం కరచాలనంతో పలకరించుకున్న అనంతరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు.

రాధాను దగ్గరుండి కారులో ఎక్కించిన వంశీ అనంతరం మాట్లాడుతూ.. రాధా తనకు మంచి మిత్రుడని, చాలా రోజుల తర్వాత కలవడంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నామని అన్నారు. కాగా, గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు-వంశీ మధ్య వివాదం నెలకొని.. పరస్పర నిందారోపణలు చేసుకుంటున్న క్రమంలో వీరి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది.

Related posts

చిన్నమ్మ బెంగుళూరు టూ చెన్నై ఖర్చు 200 కోట్లు

Drukpadam

ఖమ్మం కాంగ్రెస్ లో రేవంత్ నిరుద్యోగ నిరసన ర్యాలీ జోష్…

Drukpadam

మా అమ్మ ఆసుపత్రిలో ఉంది …విచారం వాయిదావేయండి ఈడీని కోరిన రాహుల్!

Drukpadam

Leave a Comment