Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం టీఆర్ యస్ లో బీసీల అసంతృప్తి!

ఖమ్మం టీఆర్ యస్ లో బీసీల అసంతృప్తి!
-ఓసీలకు మాత్రమే సీట్లు కేటాయిస్తారా అని ప్రశ్న
-జిల్లాలో 50 శాతం పైగా జనాభా ఉన్న బీసీలకు సీటు ఉండదా ?
-కొత్తగూడెంలో వనమా కు లేదా ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోతే ..
-సీఎం ఇంటిముందు దీక్షలు తప్పవంటున్న అనుయాయిలు

ఖమ్మం టీఆర్ యస్ లో గ్రూపులు లేకుండా , అసమ్మతిలేకుండా చూడాలని ,సీఎం కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ లు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు అడుగులు వేస్తుండగా బీసీల నుంచి అసమ్మతి వ్యక్తం అయ్యే చూచనలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు… ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉండగా అందులో జనరల్ సీట్లు మూడు మాత్రమే ఉన్నాయి. జనరల్ సీట్లలో ఇద్దరు ఓసీలకు ఒకరు బీసీ ఉన్నారు . 2018 ఎన్నికల్లో అధికార టీఆర్ యస్ మూడు సీట్లలో ఓసీలకే టికెట్స్ ఇచ్చారు . ఒక్క జనరల్ సీటు అదికూడా ఖమ్మంలో మాత్రమే టీఆర్ యస్ గెలిచింది. కాంగ్రెస్ నుంచి ఒక బీసీ , ఒక రెడ్డి గెలిచారు . తరువాత వారు టీఆర్ యస్ లో చేరారు .. టీఆర్ యస్ మూడు జనరల్ సీట్లలో ఓసీలకు సీట్లు కేటాయించినప్పుడే బీసీల్లో చర్చ జరిగింది. జిల్లాలో 50 శాతం పైగా ఉన్న బీసీలకు అసెంబ్లీకి వెళ్లేందుకు ఒక్కరు కూడా అర్హులు లేరా? అనే ప్రశ్న తలెత్తుతుంది . ఉమ్మడి జిల్లాలో ఉన్న పది సీట్లలో ఐదు ఎస్టీలకు , రెండు ఎస్సీలకు రిజర్వ్ చేశారు . మిగతా మూడులో ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వకపోవడంపై బీసీలు అసంతృప్తిగా ఉన్నారు . ఖమ్మం ఎంపీ , స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా ఓసీలలో ఒకే సామాజికవర్గానికి ఇవ్వడంపై అసంతృప్తి ఉంది.   అయితే ఇటీవలనే బీసీల నాయకుడిగా ఉన్న వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సీటు ఇచ్చి కొంత బీసీల అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం చేశారు . కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయింపులపై చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జిల్లా టీఆర్ యస్ లో ఉన్న ఇద్దరు పెద్దనాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు .వారు వేరే పార్టీలోకి వెళతారని ముమ్మర ప్రచారం జరుగుతుంది. దాన్ని వారు పలుమార్లు కొట్టిపారేసినప్పటికీ ,ప్రచారం మాత్రం ఆగడంలేదు . వారిద్దరిని పార్టీ వదులుకోదని ఖమ్మం పర్యటనకు వచ్చిన కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు .అయితే వారిని పార్టీలో ఉంచడం ఎలా సాధ్యం …వారికీ ఎదో ఒకసీటు ఇవ్వాల్సిందే …అందువల్ల తిరిగి పాలేరు టికెట్ తుమ్మలకు ఇస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఊరుకుంటాడా అంటే లేదు …మరి ఆ ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వాలి … వారు ఇద్దరు ఇద్దరే … తాను గెచినవాడిని సిట్టింగ్ సీటు అయినందున నాకే వస్తుందని కందాల నమ్మకం …లేదు నేనే పోటీచేస్తానని తుమ్మల ప్రచారం … ఒకే పార్టీలో ఉంటె ఇద్దరు పోటీ చేయడం కుదరదు …ఇక్కడ వీరిద్దరూ తప్ప బీసీ అభ్యర్థి ఆలోచన లేదు .

ఖమ్మం నుంచి ప్రస్తుతం ఉన్న మంత్రి తిరిగి పోటీ ఖాయం … ఇక కొత్తగూడెం నుంచి గత ఎన్నికల్లో గెలిచినా వనమా వెంకటేశ్వరరావు ఉన్నారు . సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వయోభారం లో ఉన్నారనే కారణాలు చూపి మాజీ ఎంపీ పొంగులేటి అసెంబ్లీ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే మరి అక్కడ బీసీకి టికెట్ ఇవ్వకపోతే బీసీలనుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వనమాకు కాకపోతే వారి కుటుంబం నుంచి టికెట్ ఆశించడం ఖాయం …. అది జరగకపోతే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అవసరమైతే సీఎం ఇంటిముందు దీక్షలు చేస్తామని వనమా అనుయాయిలు అంటున్నారు …

రాజకీయాల్లో ఇటీవల కుల ప్రస్తావన అధికమౌతుంది . మాకులం …మాకులం అంటూ కులసంఘాల సమావేశాలు పెడుతున్నారు . ఒక కులసంఘం సమావేశం పెట్టింది కదా ? మనం ఎందుకు పెట్టకూడదని మరోకులం ఆలోచన. చివరకు కులాల కుమ్ములాటలవైపు రాజకీయ నాయకులూ ఆలోచనలు చేస్తున్నారు . దీంతో ఇతర కులాలు కూడా కులసంఘాల వైపు ఆలోచనలు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి !

Related posts

నా మొబైల్ ఫోన్‌ను ట్యాప్ చేశారు: రాహుల్ గాంధీ ఆగ్ర‌హం!

Drukpadam

ఆఫ్ఘన్ లో వేగంగా మారుతున్నాపరిణామాలు …ప్రంపంచం చూపు అటు వైపే!

Drukpadam

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయం: ప‌వ‌న్ క‌ల్యాణ్!

Drukpadam

Leave a Comment