వరంగల్ లో రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత…రైల్వే స్టేషన్‌పై దాడికి ప్రయత్నం…
-ఎంజీఎం నుంచి మొదలైన యాత్ర
-వరంగల్ రైల్వే స్టేషన్ పై దాడికి ప్రయత్నం
-అంతకముందు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్ల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వరంగల్ కు చెందిన ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు ఆందోళనకారులు వరంగల్ రైల్వే స్టేషన్ పై దాడికి ప్రయత్నించారు. రాకేశ్ అంతిమ యాత్రను రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో స్టేషన్ పై దాడి చేయబోయారు.
స్టేషన్ దగ్గర పెద్ద సంఖ్యలో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. శనివారం ఉదయం వరంగల్‌లో రాజేష్ అంతిమయాత్ర జరిగింది. అంతిమయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొంతమంది ఆందోళనకారులు బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసుపై దాడి చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసును ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంతకుముందు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు. కార్యాలయం బోర్డుకు నిప్పు పెట్టారు.
వరంగల్ ఎంజీఎమ్ ఆసుపత్రి నుంచి మొదలైన రాకేశ్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాకేశ్ స్వస్థలమైన దబీర్‌పేట వరకు యాత్ర జరుగనుంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.