Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ పై కుట్ర జరుగుతుందా …?

జగన్ పై కుట్ర జరుగుతుందా… ?
-జగన్ బెయిల్ రద్దు అంటూ బీజేపీ ఇంచార్జి ఎందుకు ప్రకటించారు.
– వైకాపా తిరుగుబాటు ఎంపీ ఎందుకు జగన్ బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశారు.
-జగన్ ప్రభుత్వం ఆరునెలలు , మూడు నెలలు అంటూ ఎందుకు అంటున్నారు
-కేంద్రంలో అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తున్నా
– బీజేపీ నేతలు జగన్ పై ఎందుకు దాడి చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై కుట్ర జరుగుతుందా ? అందుకు బీజేపీ సహకారం కూడా ఉందా ? ముందుముందు ఆయన కొరకరాని కొయ్యగా మారుతారని బీజేపీ భావిస్తుందా ? ప్రతిపక్షాల శిభిరంలో చేరుతారనే అనుమానమానాలు ఉన్నాయా ? లేక జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయటం సాధ్యం కాదని భావిస్తుందా ? అంటే అవుననే సమాధానమే వస్తుంది . అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ పై బయటకు వచ్చారు . అది రద్దు అవుతుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవర ఇటీవలనే ఒక సభలో అన్నారు. కొద్దీ రోజులకే వైసీపీ అసమ్మతి ఎంపీ రఘురామకృషంరాజు జగన్ బెయిల్ రద్దు చేయాలనీ పిటిషన్ వేశారు. అంతకు ముందు ఆయన ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షా ను , ఇతర మంత్రులను, చివరకు ,ప్రధాని, మోడీని ,రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ను కలిసి జగన్ పై ఫిర్యాదులు చేసినట్లు వార్తలు వచ్చాయి . తెలుగుదేశం, ఇతర రాజకీయపార్టీలు కూడా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలుగా ఆదివారి కోరిక కావచ్చు . కాని జగన్ బెయిల్ విషయంలో ఏమి జరుగుతుంది . నిజంగా జగన్ బెయిల్ రద్దుఅవుతుందా ? అనే ఆశక్తి నెలకొన్నది . అదే జరిగితే కీంకర్త్యం అనే సందేహాలు … వైసీపీ కి శాసనసభలో తిరుగులేని మైజార్టీ ఉంది…. బెయిల్ ఉంచాలా రద్దుచేయాలా ? అనేది న్యాయప్రక్రియకు సంబందించిన అంశం . ఇది ఎవరో కోరుకొంటే జరిగేది కాదు . న్యాయ స్థానాల విషయంలో రాజకీయ జోక్యం ఉండదు . సిబిఐ ,ఇతర ఈ డి లాంటి సంస్థలు ఏ పార్టీ అధికారంలో ఉంటె దాని ప్రలోభాలతో ప్రత్యర్థి పార్టీలే లక్ష్యంగా దాడులు చేసి దారికి తెచ్చుకోవటం, కేసులు పెట్టడం అనే సూత్రాన్ని పాటిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే జగన్ పై కేసులు పెట్టారనే అభిప్రాయాలు ఉన్నాయి . కాంగ్రెస్ , టీడీపీ లు కలసి కుట్ర పూరితంగా జగన్ పై కోర్టులో కేసులు వేశాయని ఆరోపణలు ఉన్నాయి. తమ నాయకుడిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని వైసీపీ ఆరోపణ . జగన్ పై కేసుల విషయం లో లోకసభలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకురాలు సుస్మాస్వరాజ్ సైతం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సిబిఐ చేత జగన్ పై అక్రమ కేసులు పెట్టించిందని లోకసభ సాక్షిగా చెప్పారు. అనేక మంది బీజేపీ నాయకులు జగన్ పై కావాలని కాంగ్రెస్, సిబిఐ చేత దాడులు చేయించిందని ,అక్రమ కేసులు పెట్టిందని విమర్శలు చేశారు.కాని ప్రస్తుతం వారి స్వరం లో మార్పు కనిపిస్తుంది. ఎవరెన్ని ఆరోపణలు చేస్తున్న జగన్ తొణకటం బెణకటం లేదు . జగన్ మోహన్ రెడ్డి మొండి ఘటం అనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆయన తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత పావురాల గుట్ట వద్ద వైయస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబసభ్యులను అందరిని స్వయంగా వచ్చి కలిసి పరామర్శిస్తానని వాగ్దానం చేశారు. దానికి సోనియాగాంధీ అంగీకరించలేదు . దీంతో సోనియా గాంధీ ను ఎదిరించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన నేత . ఇందుకోసం ఎన్నో కష్టాలు పడ్డారు.సోనియా గాంధీ కేంద్రంలో అధికారంలో ఉండగానే ఆమెను ఎదిరించి నిలిచినా మొనగాడుగా గుర్తింపు పొందారు. అప్పుడు ఆయనకు అధికారం లేదు. ఒంటరిగానే బయటకు వచ్చారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తనతల్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. తిరిగి పోటీచేసి రికార్డు మెజారిటీ తో ఘనవిజయం సాధించారు. ఆయన పై ముప్పేట దాడి జరిగింది . సిబిఐ విచారణలు … అరెస్టులు … అక్రంగా ఆస్తులు సంపాదించారని అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది కాంగ్రెస్ , టీడీపీ కలిసి చేసిన కుట్రగా వైసీపీ ఆరోపిస్తుంది. 16 నెలలకాలం జైలులో గడిపారు. అయినప్పటికీ ఆయన గుండె దైర్యం తో వాటిని ఎదుర్కుంటున్నారు. 2014 ఎన్నికలలో 67 సీట్లతో 45 శాతం ఓట్లు పొందారు అధికారంలోకి వచ్చిన టీడీపీ కి 47 శాతం ఓట్లతో 102 సీట్లను గెలుచుకుంది . వైసీపీ కొద్దీ తేడాతో ఓడిపోయినప్పటికీ గట్టి ప్రతిపక్షంగా నిలబడ్డారు. చంద్రబాబు జగన్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలో చేర్చుకొన్నప్పటికీ ఆయన మరింత పట్టుదలతో పోరాడి రాటుదేలారు తప్ప వెనకడుగు వేయలేదు. రాష్ట్రంలో 430 రోజులపాటు ప్రజాసంకల్ప యాత్ర నిర్వవించారు . ఆయన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. ఫలితం 2019 ఎన్నికలలో తిరుగులేని మైజార్టీ తో అధిరంలోకి వచ్చారు. అంతకుముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎన్నికల్లో పోటీచేసి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. కేవలం 23 సీట్లు మాత్రమే గెలవగలిగారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. లోకసభ సీట్లు కూడా 25 ఉండగా వైసీపీ 22 గెలిచింది. టీడీపీ మూడు సీట్లకే పరిమితం అయింది. జగన్ ఎన్నికల్లో తమకు 25 సీట్లు ఇస్తే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రత్యేకహోదా ఇస్తామన్నవారికే మద్దతు ఇస్తామన్నారు. అప్పుడున్న ప్రరిస్థితుల్లో కేంద్రంలో ఏ పార్టీకి మైజార్టీ రాదని అప్పుడు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తుందనే అంచనాలతో అన్నారు. అందుకు భిన్నంగా కేంద్రంలో బీజేపీ సింగిల్ గానే ఎవరి అవసరం లేకుండా అధికారంలోకి రాగలిగింది. దీంతో జగన్ ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది . అయినప్పటికీ వైకాపా ప్రత్యేక హోదాపై కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ను నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉంది. జగన్ ప్రభుత్వాన్ని బలహీన పరచాలని ఇటు తెలుగుదేశం ,అటు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వీరికి తోడు పవన్ కళ్యాణ్ జగన్ అంటే నే ఒంటి కాలుపై లేస్తున్నాడు . జగన్ విధానాలపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు బీజేపీ విధానాలపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అనంతరం బీజేపీ కి దగ్గరై వారితో పొత్తు పెట్టుకొని జగన్ ప్రభుత్వంపై దాడి ప్రారంభించారు. జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులు ఎవరనేది తేలకపోవటం పై రకరకాల వాదనలు ఉన్నాయి. జగన్ కుటుంబమే చేసిందని టీడీపీ , బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.వైసీపీ తో పాటు జగన్ తల్లి విజయమ్మ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పై అనుమానాలు ఉన్నాయని అంటున్నారు .ఆదినారాయణ రెడ్డి తన ప్రమేయం ఉన్నట్లు తేలితే ఉరి తీయమంటున్నారు. పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన సభలో వివేకానందరెడ్డి హత్య విషయాన్నీ ప్రస్తావించి జగన్ కుటుంబంపై ఆరోపణలు చేశారు.ప్రత్యేక హోదా విషయంలో తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ని వదిలి జగన్ రెడ్డి తనకు రాష్ట్రము లో ఎక్కువమంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఎందుకు తేలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు. హోదా కు మూలం ఎక్కడుంది ఎవరు ఇవ్వాలని వదిలేసి జగన్ పై ఆరోపణలు గుప్పించటం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తాను పంచుకున్న వేదికమీద నుంచే అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి , ఇప్పడు రెండవ సారి ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ తిరుపతి వెంకన్న సాక్షిగా హోదా పై వాగ్దానం చేసిన విషయాన్నీ మరుగున పరచటం పై ప్రజలు గమనించటం లేదని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ఉపయోగం జరుగుతుందో అది చేస్తే మంచిదనే అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను ఎలా దించాలనే ఆలోచనలు 2024 ఎన్నికల్లో చేద్దురుగాని ఇప్పుడు హోదా పై ఆలోచనలు చేస్తే అందరికి ఉపయోగం ఆదిశగా రాజకీయ పార్టీలు ఆలోచనలు చేయాలనీ ప్రజలు కోరుకొంటున్నారు.

Related posts

సోనియా గాంధీ కి శాల్యూట్ …మోడీపై నిప్పులు ఢిల్లీ ప్రెస్ మీట్ లో బీఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత…

Drukpadam

ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం: అమెరికాలో రాజకీయ ప్రకంపనలు!

Drukpadam

ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పూర్తిగా వెత్తివేయడం పై కొనసాగుతున్న ఆందోళనలు

Drukpadam

Leave a Comment