Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల ప్రకటనతో పాలేరులో పోటీ రసవత్తరం కానున్నదా…?

షర్మిల ప్రకటనతో పాలేరులో పోటీ రసవత్తరం కానున్నదా…?
-ఇప్పటికే టీఆర్ యస్ లో గ్రూప్ ల కొట్లాట
-కాంగ్రెస్ పార్టీ లో అభ్యర్థి ఎవరు ?
-సిపిఎం కాంగ్రెస్ అవగాహన ఉంటె సీపీఎంకి సీటు వదులుతారా ?
-వైయస్సార్ టీపీకి కాంగ్రెస్ కు పొత్తు ఉంటుందా ?

ఖమ్మం జిల్లాలోనే పాలేరు రాజకీయాలు రసవత్తరం కానున్నాయా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు …ఇక్కడ టీఆర్ యస్ , కాంగ్రెస్ ,సిపిఎం పోటీచేసేందుకు సిద్దమవుతున్న వేళ కొత్తగా పార్టీ పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ కూతురు షర్మిల తాను పాలేరు నుంచి పోటీచేస్తానని స్వయంగా ప్రకటించడం రాజకీయ నాయకులను ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. చాలాకాలం నుంచి షర్మిల పాలేరు నుంచి పోటీచేస్తుందని వార్తలు వస్తున్నా వాటిని నిజమని నమ్మలేదు … ఇది వట్టి ప్రచారం అనుకున్నారు . కానీ ఆమె పాలేరు పర్యటనలో పోటీ విషయం ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పోటీచేస్తారు ,పొత్తులు ఎలా ఉంటాయి అనే విషయాలు చర్చనీయాంశంగా ఉన్నాయి.

రాజకీయ చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజా తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకప్పుడు పాలేరు సిపిఎం ,కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు ఉండేది. కానీ నేడు సిపిఎం బలహీనపడింది. కాంగ్రెస్ కు ఇంకా ఓటు బ్యాంకు ఉంది. 2018 ఎన్నికల్లో మంత్రి తుమ్మల పై కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు … కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి తరువాత అధికార టీఆర్ యస్ లో చేరారు . ఇప్పుడు టీఆర్ యస్ లో ఉన్న కందాల , తుమ్మల పాలేరు సీటుకోసం ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ నేను పోటీచేస్తానంటే నేనే చేస్తానని వీరివురి నేతలు ప్రకటిస్తున్నారు. సీటింగ్ అభ్యర్థిని నేనే కాబట్టి నాకే సీటు వస్తుందని కందాల విశ్వాసం తో ఉన్నారు .లేదు టీఆర్ యస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీచేసిన నాకే సీటు వస్తుందని తుమ్మల సైతం ఘంటాపథంగా చెబుతున్నారు . టీఆర్ యస్ లో అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ , సిపిఎం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది చర్చనీయాంశంగా ఉంది. పాలేరు లో పోటీ చేసేందుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీచేసిన రాయల నాగేశ్వరరావు ప్రయత్నాలు ప్రారంభించారు .ఖమ్మం రూరల్ మండలం గోళ్ళపాడు  గ్రామానికి చెందిన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ మద్ది శ్రీనివాస్ రెడ్డి కూడా పరిశీలనలో ఉన్నారు . మధిర కు చెందిన ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ బీసీ సామాజికవర్గానికి నుంచి మేళం శ్రీనివాస్ రావు కూడా పాలేరు టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు .  గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బీసీ సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర హైకోర్టు    అడ్వకేట్  ఈడా శేషగిరిరావుగట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ సీటు రాలేదు .   సిపిఎం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ తో అవగాహన తో పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక్కడ నుంచి గతంలో ఉపఎన్నికల్లో పోతినేని సుదర్శన్ , 2018 ఎన్నికల్లో బత్తుల హేమావతి పోటీచేశారు . టీఆర్ యస్ లో కందాల నియోజకవర్గం పై పట్టు సాధించారు . కొన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువైయ్యారు . అయినా కేసీఆర్ టికెట్ ఎవరికీ ఇస్తారు అనేది చివరిదాకా సస్పెన్షన్ గానే ఉండే అవకాశం ఉంది.

అయితే పాలేరు షర్మిల పోటీ ప్రకటన మిగతా పార్టీలను కూడా అలర్ట్ చేసింది. వారు కూడా అభ్యర్థుల విషయంలో ప్రకటించకపోయినా టికెట్ ఇచ్చేవారికి పనిచేసుకోమ్మని చెప్పే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు … చూద్దాం పాలేరు రాజకీయాలు ఎలా వుండబోతున్నాయో మరి !

Related posts

గిల్లుడు భేరం అంటే ఇదేనేమో … టీపీసీసీ పీఠం పై విజయసాయి వ్యాఖ్యలు…

Drukpadam

ఖమ్మం సభద్వారా రాహుల్ కు పరిపక్వత లేదని మరోసారి రుజువైంది…..మంత్రి పువ్వాడ అజయ్!

Drukpadam

కాంగ్రెస్ లోకి రమ్మంటున్నారు.. వెళ్లేది లేదు!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

Drukpadam

Leave a Comment