Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ అవినీతిపై విచారణ జరపండి …సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు …

కేసీఆర్ అవినీతిపై విచారణ జరపండి …సీబీఐకి కేఏ పాల్  ఫిర్యాదు …
-కేసీఆర్ ఫ్యామిలీ రూ.9 ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డిందని ఆరోపణ ..
-ఢిల్లీలో సీబీఐ కార్యాల‌యానికి వెళ్లిన కేఏ పాల్
-సీబీఐ డైరెక్ట‌ర్‌తో అర‌గంట పాటు భేటీ
-కేసీఆర్ అవినీతిపై ఆధారాలు స‌మ‌ర్పించాన‌న్న పాల్

కేసీఆర్ అవినీతిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు సీబీఐకి ఫిర్యాదు చేయడం చూస్తుంటే ఇదేదో కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందనే అభిప్రాయాలకు బలం చేకూర్చుతుంది. కేసీఆర్ కు కేంద్రానికి మధ్య చెడిపోయిన తర్వాత బీజేపీ తెలంగాణ పై ద్రుష్టి సారించింది. బీజేపీ కూడా అనేక సందర్భాలలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు .కానీ ఎలాంటి చర్యలు లేకుండా ఉత్తిత్తి ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. వారు నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేస్తే రంగ్ సిగ్నల్స్ వెళతాయని ఉద్దేశంతో పాల్ ద్వారా సీబీఐకి ఫిర్యాదు చేయించి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల పాల్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు . తెలంగాణ ప్రభుత్వం ,కేసీఆర్ అవినీపై ఆయనకు ఫిర్యాదు చేశారు .బీజేపీ నేతలు కూడా త్వరలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు . అందువల్ల బీజేపీ దక్షిణాదిన పట్టుకోసం అనుకూలంగా ఉన్న తెలంగాణపై ద్రుష్టి సారించింది అందులో భాగంగానే కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు అనే ప్రచారం కూడా జరుగుతుంది.

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డార‌ని, ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని సీబీఐ డైరెక్ట‌ర్ సుభోద్ జైస్వాల్‌కు ప్ర‌జా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం ఢిల్లీలో సీబీఐ కార్యాల‌యానికి వెళ్లిన పాల్‌… సీబీఐ డైరెక్ట‌ర్‌తో అర గంట పాటు భేటీ అయ్యారు.

అనంతరం కార్యాల‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన కేఏ పాల్ అక్క‌డే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఏకంగా రూ.9 ల‌క్ష‌ల కోట్ల మేర అవినీతికి పాల్ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించిన స‌మగ్ర ఆధారాల‌ను సీబీఐ డైరెక్ట‌ర్‌కు అంద‌జేశాన‌ని ఆయ‌న తెలిపారు. తాను అంద‌జేసిన ఆధారాల‌ను ప‌రిశీలిస్తామ‌ని, అవ‌స‌ర‌మ‌నుకుంటే త‌న‌ను సంప్ర‌దిస్తామ‌ని సీబీఐ డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్టు పాల్ వెల్ల‌డించారు.

Related posts

తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్లు ట్యాప్ చేస్తోంది… సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు…

Drukpadam

నేటితో మున్సిపోల్ ప్రచారం బందు…

Drukpadam

మార్పు కోసం పార్టీని విలీనం చేస్తాం …కోందండరాం సంచలన ప్రకటన …

Drukpadam

Leave a Comment