Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గుడిశల్లో పొంగులేటి …కోయగూడలను చుట్టిన మాజీ ఎంపీ

గుడిశల్లో పొంగులేటి …కోయగూడలను చుట్టిన మాజీ ఎంపీ
-చెరగని చిరునవ్వు పలకరింపుతో ఆప్యాయత అదేజోరు అదే స్పీడ్
-మంచి రోజులు రానున్నాయి. నేనున్నాను …ఆధ్వర్యపడొద్దు అంటూ ముందుకు
-దమ్మపేట ,అశ్వారావుపేటలలో పొంగులేటి పర్యటన
-పలకరిస్తూ… భరోసానిస్తూ ముందుకు సాగిన మాజీ ఎంపీ

అలుపెరగని బాటసారి …పదవి ఉన్న లేకపోయినా ప్రజల్లో తిరగడమే ,ప్రజలతో ఉండటమే ఇష్టంగా భావించి ఎన్నిపనులు ఉన్న జిల్లా ప్రజలను పలకరిస్తూ తిరుగుతున్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడిశల్లో పర్యటించి వారికీ ఆత్మీయ పలకరింపులతో అన్న , అక్క ,అమ్మ పెద్దాయన అంటూ ముందుకు సాగారు . దమ్మపేట అశ్వారావుపేట లలో జరిపిన పొంగులేటి పర్యటన ఆసక్తిగా సాగింది. చెరగని చిరునవ్వు, పలరింపులో ఆప్యాయత , అదే జోరు , అదే స్పీడ్ తో సాగిన ఆయన పర్యటనపై ప్రజలు ముచ్చటించుకున్నారు . ఈ పర్యటన ప్రజల్లో తనస్థానం మారలేదని

మంచికాలం సమీపించే గడియలు ఆనన్నమయ్యాయని… రాబోయే రోజులన్ని మనవేనని… ఏఒక్క అక్క… చెల్లి… అన్న… తమ్ముడు అధైర్యపడొద్దని… ప్రతిఒక్కరికి అండగా ఉంటానని హామీ ఇస్తూ.. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ… బాధిత కుటుంబాలకు నేనున్నా మీ శీనన్నననే భరోసానిస్తూ దమ్మపేట,అశ్వారావుపేట మండలాలలో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పర్యటించారు. పర్యటన లో భాగంగా నాగవల్లి, నాచారం, తొట్టిపంపు, గణేష్పాడు, మందలపల్లి, రంగువారిగూడెం, పాతచీపురుగూడెం తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లోని పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. పలు వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. పట్టువస్త్రాలను కానుకగా సమర్పించారు. ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులను పరామర్శించి ప్రస్తుతం వారి ఆరోగ్యస్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు ఇతర ప్రయివేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అశ్వారావుపేటలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

 

అశ్వారావుపేట: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నారాయణపురం, బచ్చువారిగూడెం, గుమ్మడివల్లి, తిరుమలకుంట, అశ్వారావుపేట గ్రామాలను సందర్శించారు. పలు శుభకార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు కుటుంబాలను పరామర్శించారు.

Related posts

పార్టీ కోసం ప్రాణాలిస్తామన్న వారే పారిపోయారు..ఉద్ధవ్​ థాకరే!

Drukpadam

ఎవరు ముఖ్యమంత్రి ….సిద్దరామయ్య నా ..? డీకే శివకుమార్ నా….??

Drukpadam

కొడాలి నాని విశ్వాసం లేని కుక్క…బుద్ధా వెంకన్న

Drukpadam

Leave a Comment