Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్ రెడ్డి ….. రణరంగంగా మరీనా కొల్హాపూర్….

జూపల్లి వర్సెస్ హర్షవర్ధన్ రెడ్డి ….. రణరంగంగా మరీనా కొల్హాపూర్….
పోలిసుల భారీ బందోబస్తు …ప్రత్యేకబలగాలను రప్పించిన అధికారులు

కొల్లాపూర్‌లో హైటెన్ష‌న్‌… టీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్ట్‌
మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మ‌ధ్య విభేదాలు
బ‌హిరంగ చ‌ర్చ‌కు ఇద్ద‌రు నేత‌ల స‌వాళ్లు
అంబేద్కర్ చౌరస్తాలో చర్చిద్దామన్న జూపల్లి
జూపల్లి ఇంటికే వస్తానన్న ఎమ్మెల్యే హర్షవర్దన్
ఇద్దరి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరింపు
అంబేద్క‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద‌కు చ‌ర్చ‌కు బ‌య‌లుదేరిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌
ఇంటి వ‌ద్దే ఆయ‌న‌ను అడ్డుకున్న పోలీసులు
అరెస్ట్ చేసి పెద్ద‌కొత్తప‌ల్లికి త‌ర‌లింపు

తెలంగాణ‌లోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆదివారం ఉద‌యం రణరంగంగా మారింది . గత ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీమంత్రి జూపల్లి కృష్ణరావు , కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచి టీఆర్ యస్ లో వెళ్లిన హర్షవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది . గతంలో ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పడు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వారిమధ్య వైరం తగ్గలేదు . చాలాకాలంగా ఉన్న ఈ వైరాన్ని తగ్గించేందుకు ఇటీవల కొల్హాపూర్ వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రయత్నం చేశారు . అయినా అది ఫలితాలను ఇవ్వలేదు . ఆయన వచ్చి ఇరువురి తో మాట్లాడి వెళ్లిన మరుసటి రోజు నుంచే సవాళ్లు , ప్రతిసవాళ్లు ప్రారంభమైయ్యాయి. చివరకు ఇరు వర్గాలు వీధి పోరాటాలకు సిద్ధమైయ్యారు . బస్తీమే సవాల్ అన్నారు . కొల్హాపూర్ లో పరిణామాలపై రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ద్రుష్టి పెట్టాయి. ఇది ఒక సెస్పెన్షన్ సీరియల్ ను తలపించే విధంగా ఎప్పుడు ఏమి జరుగుతుంది. ఎవరిదీ పై చేయి అయింది. అని ఆత్రతగా టీవీ వార్తలు చూస్తున్నారు .

కొల్లాపూర్‌లో ఆదివారం ఉద‌యం హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాద‌మే ఇందుకు కార‌ణంగా నిలిచింది. 2014లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూప‌ల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. అయితే 2018 ఎన్నిక‌ల్లో జూప‌ల్లి ఓటమిపాల‌య్యారు. జూప‌ల్లిని ఓడించిన కాంగ్రెస్ అభ్య‌ర్థి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌రెడ్డి ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య విభేదాలు నెల‌కొన్నాయి.

ఈ క్ర‌మంలో ఇద్ద‌రు నేత‌లు ఒక‌రిపై మ‌రొకరు శ‌నివారం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. బ‌హిరంగ చ‌ర్చకు సిద్ధ‌మంటూ ఇద్ద‌రు నేత‌లు స‌వాళ్లు విసురుకున్నారు. ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద జూప‌ల్లితో చ‌ర్చ‌కు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి బ‌య‌లుదేరేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అప్ప‌టికే ఆయ‌న ఇంటికి ఆయ‌న అనుచ‌రులు భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. ప‌రిస్థితి చేజారిపోతోంద‌ని గ్ర‌హించిన పోలీసులు… చ‌ర్చ‌కు వెళ్లేందుకు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌కు అనుమ‌తి నిరాక‌రించారు.

అయినా కూడా విన‌ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చ‌ర్చ‌కు వెళ్లి తీర‌తానంటూ భీష్మించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని త‌మ వాహ‌నంలోకి ఎక్కించారు. అయితే అప్ప‌టికే అక్క‌డికి చేరుకున్న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అనుచ‌రులు వాహ‌నాన్ని క‌ద‌ల‌నీయ‌కుండా అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆ త‌ర్వాత ఎలాగోలా కారును అక్క‌డి నుంచి క‌దిలించిన పోలీసులు… హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను పెద్ద‌కొత్త‌ప‌ల్లికి త‌ర‌లించారు.

అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కొల్లాపూర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండువర్గాల బాహాబాహీకి తలపడ్డాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య కొన్నాళ్ల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు . నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్‌ చాలెంజ్‌ చేస్తూ ..బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఆదివారం ఉదయం కొల్లాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని జూపల్లి సవాల్ విసిరారు. అయితే, చర్చకు జూపల్లి ఇంటికే వస్తానని ఎమ్మెల్యే హర్షవర్దన్ ప్రతిసవాల్ విసిరారు. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్‌ కొల్లాపూర్‌ చేరుకున్నారు.

దాంతో, కొల్లాపూర్‌లో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతిలేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. జూపల్లి ఇంటి వద్దకు వచ్చిన ఆయన అనుచరులు కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు.. ఇంటికే పరిమితం చేశారు. ఎమ్మెల్యే హర్షవర్దన్ తన ఇంటికి వస్తానన్నారని, అందుకు సిద్ధంగా ఉన్నానని జూపల్లి అన్నారు.

Related posts

మళ్లీ హైదరాబాద్ కు వచ్చిన ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్

Drukpadam

కడుపు మంటతోనే విమర్శలు -తప్పుడు ప్రచారాలు :సజ్జల

Drukpadam

ఖమ్మం లో కారు దిగుతున్న నేతలు …అధిష్టానం గుస్సా !

Drukpadam

Leave a Comment