Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆత్మకూరు లో మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం!

  • ఆత్మకూరు లో మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం!
    -ఈ విజయం గౌతమ్ కు నివాళి… సీఎం జగన్ స్పందన
    -డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్య‌ర్థి భ‌ర‌త్ కుమార్‌
    -వైసీపీ శ్రేణుల హర్షితిరేకాలు
    -గౌతమ్ రెడ్డి మరణంతో ఉప ఎన్నికలు
    -గౌతమ్ సోదరుడికి పట్టం కట్టిన నియోజకవర్గ ప్రజలు

మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానంతరం ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా ఆత్మకూరులో 83 వేల మెజారిటీతో విక్రమ్ ను గెలిపించారని వివరించారు.

విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భ‌ర‌త్ కుమార్‌పై మేక‌పాటి ఏకంగా 82,888 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి డిపాజిట్ గ‌ల్లంతు కావ‌డం గ‌మ‌నార్హం. ఓట్ల లెక్కింపులో మొత్తంగా 20 రౌండ్ల పాటు కౌంటింగ్ జ‌ర‌గ్గా.. ప్ర‌తి రౌండ్‌లోనూ మేక‌పాటి ఆధిక్యం సాధిస్తూ వ‌చ్చారు. వెర‌సి ఈ ఎన్నిక‌లో ఆయ‌న ఏక‌ప‌క్ష విజ‌యాన్ని న‌మోదు చేశారు.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో 1,37,081 ఓట్లు పోల్ కాగా… వాటిలో మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి 1,02,074 ఓట్ల‌ను సాధించారు. 15వ రౌండ్ పూర్తి అయ్యే స‌రికే మొత్తం పోలైన ఓట్ల‌లో 50 శాతానికి పైగా ఓట్ల‌ను ద‌క్కించుకున్న విక్ర‌మ్ రెడ్డి అప్ప‌టికే త‌న విక్ట‌రీని ఖ‌రారు చేసుకున్నారు. ఆ త‌ర్వాత 5 రౌండ్లు ఆయ‌న‌కు ద‌క్కిన మెజారిటీని తేల్చేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ్డాయి. దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో జ‌రిగిన ఈ ఎన్నికలో ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్ర‌మ్ రెడ్డి విజ‌యం సాధించారు.

జగన్ అమలు చేస్తున్న పథకాలే నా విజయానికి కారణం: మేకపాటి విక్రమ్ రెడ్డి

 

Mekapati Vikram Reddy talks about his victory in Atmakur

ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘనవిజయం అందుకున్నారు. 82 వేలకు పైగా ఓట్లతో భారీ మెజారిటీ సాధించారు. మొత్తం 20 రౌండ్ల పాటు ఓట్లు లెక్కించగా, ఏ రౌండ్ లోనూ ఆయన వెనుకబడింది లేదు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యం నిలుపుకుంటూ వచ్చారు.

కాగా, విజయం సాధించిన అనంతరం మేకపాటి విక్రమ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. తమ కుటుంబంపై మరోసారి నమ్మకం ఉంచినందుకు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.

ఉప ఎన్నిక చాలా పారదర్శకంగా జరిగిందని, సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలే తన గెలుపునకు కారణమని వివరించారు. ఏపీ సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు మునుపెన్నడూ లేనంత గొప్పగా అమలవుతున్నాయని, సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం అని విక్రమ్ రెడ్డి తెలిపారు. మహానేత వైఎస్సార్ ను మరిపింపజేసేలా పరిపాలన సాగిస్తున్నారనంటూ సీఎం జగన్ ను కొనియాడారు. జగన్ సమర్థ నాయకుడు అని, అలాంటి వ్యక్తి నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని ఉద్ఘాటించారు.

Related posts

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు అడగలేదన్న సత్యకుమార్ ….ఆగ్రహం వ్యక్తం చేసిన షాకవత్!

Drukpadam

వి హెచ్ కాంగ్రెస్ ను వీడను న్నారా ?

Drukpadam

ఖమ్మం లో మంత్రి అజయ్ పై ధ్వజమెత్తిన షర్మిల!

Drukpadam

Leave a Comment