Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే తాటి చిచ్చు …

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే తాటి చిచ్చు
అశ్వారావు పేట కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహం
పీసీసీ తో తేల్చుకునేందుకు హైద్రాబాద్ లో మకాం
జిల్లాకు చెందిన సీఎల్పీ నేత భట్టిని కలిసిన అశ్వారావుపేట నేతలు
రేపు ఉదయం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీఆర్ యస్ కు చెందిన తాటి వెంకటేశ్వర్లు ఉన్నట్లు ఉండి ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు ఎవరికీ చెప్పకుండా నేరుగా గాంధీ భవన్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం జిల్లా కాంగ్రెస్ లో చిచ్చుకు కారణమైంది. రెండురోజుల ముందు అశ్వారావుపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ యస్ పైన ప్రత్యేకించి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన విమర్శలు గుప్పించారు . తనకు టీఆర్ యస్ లో సరైన గౌరవం లభించడంలేదని , ఆయన ఆరోపణ … గత అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల తనకు ఓట్లు వేయించలేక పోయారని , ఆయన స్వగ్రామం గండుగులపల్లి లోనే టీఆర్ యస్ కు ఓట్లు వేయించలేని అసమర్థుడని ధ్వజమెత్తారు . తనకు పార్టీలో సరైన గౌరవం లభించని యెడల పార్టీ మారతానని అల్టిమేటం ఇచ్చారు . అప్పుడే తాటి పార్టీ మార్పు ఖాయం అనుకున్నప్పటికీ ఇంత తొందరగా మారతాడని ఎవరు అనుకోలేదు … నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి సమాచారం లేదు . పోనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కు సమాచారం కూడా లేదని అంటున్నారు . ఆయన వెంట కూడా పెద్ద వెళ్లిన దాఖలాలు లేవు …రాష్ట్ర పార్టీలో కీలక నేతగా ఉన్న సీఎల్పీ నాయకుడు భట్టికి కూడా తెలియదు . రేణుక చౌదరికి సమాచారం లేదు … ఇంతమందికి తెలియకుండా తాటి కాంగ్రెస్ లో చేరిక పార్టీకి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చుతుంది స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు . పార్టీ కష్టకాలంలో అష్టకష్టాలు పడి అవమానాలు ,కేసులు భరించి నిలిచినా తమను తెలియకుండా తాటిని ఎట్లా పార్టీలో చేర్చుకుంటారని నాయకులను నిలదీస్తున్నారు .

భట్టిని కలిసిన వారిలో ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి , చీకటి శ్రీనివాస్ రావు , మద్ది శెట్టి సత్య ప్రసాద్ , వనమా గాంధీ , తుమ్మ రాంబాబు , మొగుళ్ళ చిన్న కేశవరావు , చిలక శ్రీను , కందుల వెంకటేశ్వరరావు , పద్మ , తదితరులు ఉన్నారు . భట్టి వారికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు . అయినప్పటికీ వారు తమ అసమ్మతిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలియజేయాలని నిర్ణయించుకున్నారు . అందుకు రేవంత్ అంగీకరించారు . రేపు ఉదయం కలిసేందుకు అంగీకరించారు .

అందరిని కలుస్తామాజీ ఎమ్మెల్యే తాటి

తాను త్వరలో కాంగ్రెస్ స్థానిక నాయకులతోపాటు అందరిని కలిసి మాట్లాడతానని , వారితో కలిసి పనిచేస్తానని టీఆర్ యస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు తెలిపారు . తనపై నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రుగా ఉన్న విషయంపై ఆయన స్పందించారు . సీఎల్పీ నేత భట్టిని ,ఇతర నాయకులను కలుస్తానని అన్నారు .

Related posts

నేను ఇకనుంచి పాలేరు బిడ్డను …రాజన్న రాజ్యం తెస్తా :షర్మిల

Drukpadam

ప్రజా గాయకుడు గద్దర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి …కేసీఆర్ పై పోటీకి సై..!

Drukpadam

స్పీకర్ పోచారం తీరుపై అసెంబ్లీలో చర్చ జరగాలి: బండి సంజయ్!

Drukpadam

Leave a Comment