Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇడుపులపాయ‌లో గ్రామ స‌చివాల‌యానికి తాళం!… !

ఇడుపులపాయ‌లో గ్రామ స‌చివాల‌యానికి తాళం!… !

  • ఆర్బీకే ఏర్పాటుపై వైసీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు
  • ఇడుపుల‌పాయ‌లోనే ఆర్బీఏ ఏర్పాటు చేయాల‌న్న ఓ వ‌ర్గం
  • వ‌ర్షానికి మునిగే ప్రాంతంలో ఆర్బీకే వ‌ద్దన్న మ‌రో వ‌ర్గం

కడప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని గ్రామ స‌చివాల‌యానికి అధికార పార్టీ శ్రేణులే తాళాలు వేశారు. గ్రామానికి చెందిన వైసీపీలో రెండు వ‌ర్గాలు ఉండ‌గా… ఓ వ‌ర్గం శ్రేణులు గ్రామ సచివాల‌యానికి తాళం వేసి అక్క‌డే ధ‌ర్నాకు దిగారు. ప్ర‌త్యర్థి వ‌ర్గంతో వారు వాదులాట‌కు దిగారు. త‌ద‌నంత‌రం ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసి ఇరు వర్గాల‌ను చెద‌ర‌గొట్ట‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

ఈ ఘ‌ట‌న‌కు దారి తీసిన వివ‌రాల్లోకెళితే… ఇడుపుల‌పాయ‌లో రైతు భ‌రోసా కేంద్రం (ఆర్బీకే) ఏర్పాటుకు సంబంధించి గ్రామ వైసీపీ శాఖ‌లోని రెండు వర్గాల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇడుపుల‌పాయ‌లో గ్రామ స‌చివాల‌యం స‌మీపంలోనే ఆర్బీకేను ఏర్పాటు చేయాల‌ని ఓ వ‌ర్గం వాదించింది. అయితే వ‌ర్షం ప‌డితే ఆ ప్రాంతం నీట మునుగుతుంద‌ని, అలాంటి ప్రాంతంలో ఆర్బీకే ఏర్పాటు వ‌ద్ద‌ని ఇంకో వ‌ర్గం వాదించింది. ఈ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య మాటామాటా పెరిగి వివాదం చెల‌రేగింది. అనంత‌రం వైంపల్లె జ‌డ్పీటీసీ ర‌వికుమార్ రెడ్డి వ‌ద్ద ఇరు వ‌ర్గాలు పంచాయితీ పెట్టాయి.

Related posts

ముంబై లో లేడీ కానిస్టేబుల్ ఔదార్యం – ఉన్నతాధికారుల సెల్యూట్…

Drukpadam

హక్కుల పరిరక్షణకు మానువాదాన్ని మట్టుబెట్టాలి

Drukpadam

ఎట్టకేలకు సీపీఎం తొలి జాబితా విడుదల.. పాలేరు నుంచి తమ్మినేని !

Ram Narayana

Leave a Comment