Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వేడెక్కుతున్న కొత్తగూడెం రాజకీయాలు ….నియోజకర్గం పై పలువురి చూపు!

వేడెక్కుతున్న కొత్తగూడెం రాజకీయాలు ….నియోజకర్గం పై పలువురి చూపు!
-టీఆర్ యస్ నుంచి వనమా కుటుంబం కాకపోతే అనే కోణంలో చర్చ
-పొంగులేటి , జలగం , తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాస్ పేర్లు తెరపైకి
-కాంగ్రెస్ నుంచి పోట్ల నాగేశ్వరరావు , ఎడవల్లి కృష్ణ ..మరో ఇద్దరు
-బీజేపీ నుంచి కోనేరు సత్యనారాయణ( చిన్ని)
-పొత్తులో సీటు కోరుతున్న సిపిఐ …మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రంగంలో ఉండే అవకాశం

తెలంగాణ బొగ్గు గనుల ప్రధానకేంద్రం కొత్తగూడెం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం తరువాత అంతటి పేరున్న పట్టణంగా కొత్తగూడెం ఉంది. బొగ్గనులతో పాటు పక్కనే ఉన్న పాల్వంచ లో థర్మల్ విద్యుత్ ప్రాజక్టు , నవభారత్ పెర్రో ఎల్లాయిస్ , స్పాంజ్ ఐరన్ , లాంటి కర్మాగారాలలో పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది . రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ ఇక్కడ రాజకీయాలు ఇప్పటినుంచే వేడెక్కుతున్నాయి.. ఒకరికి మించి మరొకరు పర్యటనలతో తామున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు .

వివిధ పార్టీల నుంచి పలువురి చూపు కొత్తగూడెం పై పడింది. టీఆర్ యస్ నుంచి వనమా కుటుంబం కాకపోతే అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. అయితే వనమా కుటుంబం ఈ సీటును ఎట్టి పరిస్థిలో వదులుకోవడానికి సిద్ధంగా లేదని విశ్వసనీయ సమాచారం … మరొకరికి అనే అవకాశమే లేదని వారి అనుయాయులు అంటున్నారు . అయినప్పటికీ ఇక్కడ నుంచి పోటీకి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు . మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి పోటీచేసిన జలగం వెంకట్రావు , తెలంగాణ హెల్త్ డైరక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు పేర్లు తెరపైకి వస్తున్నాయి.

శ్రీనివాస్ రావు ఇటీవల కొత్తగూడెం పై కేంద్రీకరించారు .స్థానికంగా చదువుకున్న శ్రీనివాస్ రావు కు కొత్తగూడెం తో మంచి సంబంధాలు ఉండటంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొత్తగూడెం నుంచి పోటీచేయాలని కుతూహలం తో ఉన్నారు . అందుకు అనుగుణంగా ఆయన ఇప్పటికే హెల్త్ ఆ క్యాంపు లు పట్టడమే కాకుండా గురువారం రోజున పుట్టిన రోజు వేడుకలు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కొత్తగూడెంలో జరుపుకున్నారు . ఊరంతా ఆటోలపై పోస్టర్లు , ప్లేక్సీలు ,దర్శనమిస్తున్నాయి . ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి జన్మదిన వేడుకల ఆర్భాటంపై చర్చ జరుగుతుంది. ఆయనది కూడా ఎమ్మెల్యే వనమా సామాజికవర్గం కావడం గమనార్హం …

టీఆర్ యస్ నుంచి జలగం వెంకట్రావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు వినిపిస్తుండగా , కాంగ్రెస్ నుంచి పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం లో ఇల్లు తీసుకోని మకాం వేశారు . కొత్తగూడెం నుంచి పోటీకి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు . అనేక సార్లు టికెట్ కోసం ప్రయత్నం చేసి భంగపడిన ఎడవల్లి కృష్ణ సైతం తిరిగి తన ప్రయత్నాల్లో ఉన్నారు . బీజేపీ నుంచి కోనేరు చిన్ని పోటీ ఖాయమనే ప్రచారం జరుగుతుంది. టీఆర్ యస్ లో పొత్తులో భాగంగా సిపిఐ కి సీటు కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పోటీలో ఉండే అవకాశం ఉంది. దీంతో కొత్తగూడెం లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. …

Related posts

పెద్ది రెడ్డి ,రఘురామ కృషంరాజుల మధ్య మాటల యుద్ధం

Drukpadam

దేశ విభజనపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను సమర్థించిన ఫరూఖ్ అబ్దుల్లా!

Drukpadam

క్లౌడ్ బరస్ట్ , క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటో ..కేసీఆర్ తెలుసుకుని మాట్లాడాలి..కొండా విశ్వేశ్వర్ రెడ్డి!

Drukpadam

Leave a Comment