Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు!

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు!
– భద్రతా ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీసుల సమీక్ష సమావేశం

జూలై 2, 3 తేదీల్లో మాదాపూర్ లోని హైక్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైబరాబాద్ కు రానున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను, బందోబస్త్ ప్రణాళిక పై సమీక్షించేందుకు సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర,ఐ‌పీఎస్., ఈరోజు హైక్ కాన్ఫిరెన్స్ హాల్లో లా& ఆర్డర్ పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులకు మరియు పోలీసు సిభందికి బ్రీఫింగ్ చేశారు.

ఈ సమావేశంలో సీపీ గారు మాట్లాడుతూ.. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఎస్ పి జి ఎస్ , బ్లూ బుక్‌కు కట్టుబడి ఉండేలా అన్ని భద్రతా ప్రణాళికలను రూపొందించామన్నారు. మూడంచెల బందోబస్త్ ప్రణాళికలను రూపొందించామని, యాక్సెస్ కంట్రోల్‌తో పాటు విధ్వంస నిరోధక జాగ్రత్తలు, వీవీఐపీ ల రక్షణ కోసం భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు , ట్రాఫిక్ అధికారులు అన్ని భద్రతా ప్రణాళికలను పాటించాలన్నారు. అలాగే వీవీఐపీ మరియు విప్ ల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రతీరోజూ టెలీ కాన్ఫరెన్సు నిర్వహిస్తామని, ఎటువంటి ఇబ్బందులున్నా ఇన్ చార్జ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. అందరూ టీమ్ స్పిరిట్ తో పనిచేయాలని, విధులలో సంయనంతో వ్యవహరించాలన్నారు. విధులలో ఎవరైనా అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు.

ఈ సమావేశంలో ప్రధాని పర్యటన వివరాలు, ఆయన రాక, బస, హాజరు, నిష్క్రమణ వివరాలు, అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మిక ప్రణాళికలు తదితరాలపై చర్చించారు. బందోబస్త్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, నిర్వ హించాల్సిన విధులను వివరించారు. మరియు పోలీసులు వేధిక వద్ద ఏర్పాటు చేయనున్న కంట్రోల్ సెంటర్ నుండి ఏదైనా సమస్యను త్వరగా పరిష్కరించేందుకు అధికారులను నియమిస్తామని తెలియజేశారు.

ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీతో పాటు జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఐపీస్., మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, డీసీపీ కవిత, డీసీపీ ఇందిర, ఎస్‌బి ఏడీసీపీ రవి కుమార్, ఏడీసీపీ రియాజ్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ అమితాబ్‌, నాగార్జున‌..

Drukpadam

బ్యాంకు ల బడాయి … రైతు 31 పైసల బాకీకి నో డ్యూ సర్టిఫికెట్ నిరాకరణ !

Drukpadam

ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్నారు: జో బైడెన్ ఆవేదన!

Drukpadam

Leave a Comment