Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ తో చర్చించాం: మల్లు భట్టి విక్రమార్క

  • పార్టీ వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామన్న మల్లు
  • ఇప్పుడు అన్ని విషయాలు సర్దుకున్నాయని వ్యాఖ్య
  • రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీ చేరికలుంటాయన్న మల్లు

తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపైనే కేసీ వేణుగాపాల్ తో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరగిందని చెప్పారు. ఇప్పుడు అంతా సర్దుకుందని అన్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా… బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న దోస్తీ బయట పడిందని చెప్పారు. బీజేపీ,టీఆర్ఎస్ లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

మునిసిపాలిటీగా అమ‌రావ‌తి… 22 గ్రామాల అభిప్రాయాల కోసం క‌లెక్ట‌ర్‌కు ఏపీ స‌ర్కారు ఆదేశాలు!

Drukpadam

కరోనా తర్వాత నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది: సజ్జనార్‌

Drukpadam

టీటీడీ వెబ్ సైట్ పేరు మారింది!

Ram Narayana

Leave a Comment