విజయవాడ సర్కారీ స్కూల్లో సింగిల్ సీటు కోసం పోటీ పరీక్ష!… ఆ స్కూలు ఘనత అలాంటిది మరి!
- విజయవాడలోని సత్యనారాయణపురంలో ఏకేటీపీఎం స్కూల్
- మొత్తం 1,900 మంది విద్యార్థులకు విద్యా బోధన
- ఖాళీ అయిన సీటు భర్తీ చేసే యత్నం
- పదుల సంఖ్యలో వచ్చిన వైనం
- ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించిన ఉపాధ్యాయులు
కింది ఫొటో తెలుగు దినపత్రికల్లో అగ్రగామిగా నిలిచిన ఈనాడు పత్రిక కటింగ్. ఈ ఫొటోలో కింద విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే… పరీక్షను పర్యవేక్షిస్తున్న టీచర్లు కూడా కనిపిస్తున్నారు కదా. ఇదేదో విద్యా సంవత్సరం ముగిశాక జరుగుతున్న పరీక్షలు కాదు. విద్యా సంవత్సరం మధ్యలో నిర్వహించే యూనిట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలు అంతకంటే కూడా కాదు. ఇక ఈ ఫొటో ఏ ప్రైవేటు, కార్పొరేటు స్కూలులో తీసిన ఫొటో కూదా కాదు. విజయవాడ నగర పరిధిలోని సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం నగర పాలక సంస్థ పాఠశాలలో తీసిన ఫొటో.
ఈ ఫొటో పక్కనే ఈనాడు పత్రిక దాని వివరాలను కూడా ప్రచురించింది. ఈ స్కూళ్లో ప్రవేశాలు అస్సలు దొరకడం లేదు. ఒక్కసారి ఈ స్కూల్లో చేరిన పిల్లలు పదో తరగతి పూర్తయ్యే దాకా టీసీలు తీసుకోవడం లేదు. పిల్లల తల్లిదండ్రులు అయితే ఏకంగా ఈ పాఠశాలలో సీటు దొరికితే చాలు… ఏకంగా సత్యనారాయణపురానికే మకాం మార్చేద్దామని భావిస్తున్నారు.ఇలాంటి నేపథ్యంలో ఈ ఏడాదికి సంబంధించి ఓ విద్యార్ధి టీసీ తీసుకుని వెళ్లగా… ఖాళీ అయిన ఆ సీటును భర్తీ చేసేందుకు పాఠశాల ఉపాధ్యాయులు యత్నించగా… ఏకంగా పదుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయట. దీంతో ఎంట్రెన్స్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికే సీటు ఇస్తామని చెప్పి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షకు సంబంధించిన ఫొటోనే ఇది.

6 నుంచి 10 తరగతులను బోధిస్తున్న ఈ స్కూల్లో ప్రస్తుతం 1,900 మంది విద్యార్థులు చదువుతున్నారు. సర్కారీ బడి అయినప్పటికీ ఇక్కడి ఉపాధ్యాయులు ఉత్తమంగా విద్యాబోధన చేస్తున్నారని, ఫలితంగా టెన్త్‌లో ప్రైవేట్ స్కూళ్లను మించి మంచి ఫలితాలు సాధిస్తుందోన్న ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఈ స్కూల్లో తమ పిల్లలకు సీట్ల కోసం పెద్ద ఎత్తున తల్లిదండ్రులు యత్నిస్తున్నారు.