Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజ్య‌స‌భ‌కు ‘బాహుబ‌లి’ క‌థా ర‌చ‌యిత‌ విజయేంద్రప్రసాద్!

రాజ్య‌స‌భ‌కు ‘బాహుబ‌లి’ క‌థా ర‌చ‌యిత‌ విజయేంద్రప్రసాద్, ఇళయరాజా!

  • రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన న‌లుగురు
  • పీటీ ఉష‌, వీరేంద్ర హోగ్డేల‌ను నామినేట్ చేసిన వైనం
  • రాష్ట్రప‌తి కోటాలో ఈ న‌లుగురి ఎంపిక‌

రాజ్యసభకు బహుబలి కథా రచయత విజేయంద్ర ప్రసాద్ రాజ్యసభకు వివిధ రంగాలో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసే దానితో బాగంగా బహుబలి కథా రచయత రాజమౌళి తండ్రిని  కేంద్రం ఎంపిక చేసింది.బాహుబలి చిత్రానికి కథను రాసి అందించిన విజయేంద్ర ప్రసాద్ ప్రపంచవ్యాపితంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు . ఈయనతో పాటు మలయాళ సంగత దర్శకుడు ఇళయరాజా , పరుగుల రాణిగా గుర్తింపు తెచ్చుకున్న పీటీ ఉష ,వీరాండ్ర హెగ్డే లను ఎంపిక చేసినట్లు స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు .

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ క‌థా ర‌చ‌యిత వి. విజ‌యేంద్ర ప్రసాద్ రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. రాష్ట్రప‌తి కోటాలో ప‌లు రంగాల‌కు చెందిన న‌లుగురిని నామినేట్ చేస్తూ న‌రేంద్ర మోదీ స‌ర్కారు బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ జాబితాలో విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో పాటు ప్రముఖ సినీ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా, ప‌రుగుల రాణి పీటి ఉష‌, వీరేంద్ర హెగ్డేల‌ను ఎన్డీఏ స‌ర్కారు రాజ్య‌స‌భకు నామినేట్ చేసింది.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ… విజ‌యేంద్ర ప్ర‌సాద్ సినీ రంగానికి చేసిన కృషిని కీర్తించారు. ద‌శాబ్దాలుగా సినీ రంగానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ సేవ‌లందిస్తున్నార‌ని మోదీ పేర్కొన్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చేసిన కృషి వ‌ల్ల భార‌త సంస్కృతి విశ్వవ్యాప్త‌మైంద‌ని కూడా మోదీ తెలిపారు.

కేంద్రం రాజ్యసభకు ఎంపిక చేసింది వీరినే

Related posts

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని …

Ram Narayana

జాతరలో కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చిందులు …

Drukpadam

తెలంగాణ సచివాలయం ఎదుట తెలుగు తల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు !

Drukpadam

Leave a Comment