Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి ఉపఎన్నిక ప్రచారం లో టీడీపీ దూకుడు…

తిరుపతి ఉపఎన్నిక ప్రచారం లో టీడీపీ దూకుడు…
-టీడీపీ యంత్రాగం అంత తిరుపతి లోనే
-చంద్రబాబు , లోకేష్ ల పర్యటనలతో జోష్
-ఎంపీలు , ఎమ్మెల్యేల పర్యటనలతో హీటేక్కిన ప్రచారం
తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ దూకుడు పెంచింది. తమ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున పార్టీ అధినేత చంద్రబాబునాయుడు , ఆయన తనయుడు లోకేష్ ప్రచారంలోకి దిగడంతో టీడీపీ కార్యకర్తలలో జోష్ పెరిగింది. టీడీపీ కి ఉన్న ముగ్గురు లోకసభ సభ్యులలో రామ్మోహన్ నాయుడు , గల్లా జయదేవ్ లు ప్రచారంలో పాల్గొంటుండగా విజయవాడ కు చెందిన కేశినేని నాని దూరంగా ఉన్నారు. రాజ్యసభ ఎంపీ కొల్లు రవీంద్ర , మరికొందరు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , మాజీ మంత్రులు, చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా , ప్రచారంలో పాల్గొంటున్నారు. ముందు కొంత నిరుత్సహాంగా ఉన్న తెలుగుదేశం శిభిరం చంద్రబాబు ,లోకేష్ ప్రచారం తో పరుగులు పెడుతుంది. గతంలో ఎన్నడూ సందులు గొందులు తిరగని చంద్రబాబు గ్రామాలలో సైతం తిరుగుతున్నారు. మాజీలను కలుస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల పరిధిలోని మొత్తం 7 నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు తన మాటలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రసంగాలలో హాస్యం జోడిస్తూ చేసున్నప్రయత్నాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. పనబాక లక్ష్మి గెలిస్తే మీ తరుపున ముగ్గురు పులులకు తోడు మరో పులి పార్లమెంట్ లో కొట్లాడుతుందని చేస్తున్న ప్రచారం ఆలోచింప చేస్తున్నది . ఒక పార్లమెంట్ సీటు గెలిచినా గెలవక పోయిన వచ్చేది ఏమి లేదని జగన్ రెడ్డి పాలనపై తీర్పు ఇవ్వాలని లోకేష్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన పిట్టకథలతో , ముడుపిల్లుల కథ వైసీపీ పార్లమెంట్ సభ్యుల పై చెబుతూ ప్రచారం చేస్తున్నారు. పనబాక అనుభవం ఉన్న వ్యక్తి నాలుగు సార్లు లోకసభకు ఎన్నికైయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఉంది అని ఆమె ను ఎన్నుకోవటం ద్వారా తిరుపతి వాయిస్ మరింత పార్లమెంట్ లో మరింత ఇనపడుతుందని వివరించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది పోటీలో ఉన్నప్పటికీ వైకాపా ,టీడీపీ బీజేపీ ల మధ్యనే పోటీ ఉంది. బీజేపీ మొదట దూకుడుగా వ్యవహరించినా, పవన్ కళ్యాణ్ పర్యటన కొంత ఉత్సవ పరిచినప్పటికీ ఎందుకో వెనకబడి ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇక అధికార వైసీపీ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ లలో గెలిచింది .అందువల్ల ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాలలో మెజార్టీ పై ద్రుష్టి పెట్టారు. గెలుపు మాకు లెక్కకాదు అని నియోజవర్గాలలో వచ్చే మెజార్టీ కొలమానంగా ఉంటుందంటున్నారు. జగన్ పర్యటన ఉన్నప్పటికీ కరోనా తిరిగి విజృంభిస్తుండటంతో తన తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారు.సీఎం పర్యటన తోనే వారి పార్టీ గెలుపుపై నమ్మకం కోల్పోయిందని ప్రచారం మొదలు పెట్టారు . ఇప్పుడు జగన్ పర్యటన రద్దు చేసుకోవడంతో వైసీపీ అభ్యర్థి పై ఆ ప్రభావం పడుతుందా లేదనే అంటున్నారు వైసీపీ నేతలు . తెలుగుదేశం మాత్రం ఆశలు వదులుకొని జగన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శలు చేస్తుంది. బీజేపీ వ్యూహం ఎక్కడో తేడా కొడుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

నూతన సంవత్సర విందు కోసం మేకలను దొంగిలించిన పోలీసులు!

Drukpadam

బైడెన్‌పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ఒక్క క్షణం కూడా నిలవడేమో అంటూ..

Drukpadam

కర్ణాటకలో ప్రధాని పర్యటన బీజేపీని గట్టెక్కిస్తుందా …?

Drukpadam

Leave a Comment