Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు … గురుమూర్తి

ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు … గురుమూర్తి
-బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ ఆరోపణలకు ఖండన
-ఎన్నికల్లో మత ప్రస్తావన ఏమిటని విమర్శ
-తాను హిందువునేని ఆధారాలు మీడియా ముందు వెల్లడించిన గురుమూర్తి
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రకారం హీటెక్కింది .ఆరోపణలు ,ప్రత్యారోపణలతో రాజకీయ పార్టీలు ఎండలకు తోడు మరింత కాకపుట్టిస్తున్నాయి. అన్ని పార్టీలు వైసీపీ లక్ష్యం గానే విమర్శలు చేస్తున్నాయి. ఇందులో బీజేపీ మరో అడుగు ముందుకేసి వైకాపా అభ్యర్థి హిందువు కాదంటూ చేస్తున్న ప్రచారంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మతాన్ని ప్రచారంలో వాడుకోవడం పై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఓట్ల కోసం బీజేపీ తనను హిందువు కాదంటూ చిల్లర రాజకీయాలు చేస్తుందని వైకాపా అభ్యర్థి గురుమూర్తి విమర్శించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ చేస్తున్న ప్రచారం పై ఆయన మండిపడ్డారు . ఎన్నికల్లో కుల, మత రాజకీయాలు ఏమిటి ప్రజలకు ఎవరు మేలు చేస్తారనేది చూడాలి . రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పాలనా సాగుతుంది. కులాల వారిగానో ,మతాలవారిగానో విభజన పాలనలో లేదు. తాను హిందువు కాదంటూ బీజేపీ నేతగా ,భాద్యత గల పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం తగదని ఆయన హితవుపలికారు. తాను హిందువునేనని చెప్పేందుకు ఆయన వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శిచుకున్న ఫొటోతో పాటు నామినేషన్ వేసే ముందు గ్రామదేవతలకు పూజలు చేసిన ఫోటోలను మీడియా సమావేశంలో చూపించారు. బీజేపీ పార్టీ , వైకాపా అభ్యర్థి మతంపై చేస్తున్న ప్రచారంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. అభివృద్ధిపై లేదా ప్రత్యేక హోదా విషయంలో ,విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలనీ రాష్ట్ర ప్రజలు కోరుకొంటున్నారని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల గుణగణాలు వారు ప్రజలకు ఏవిధంగా మేలు చేస్తారు పార్టీల వైఖరి ఏమిటి అనేదానిపై చర్చజరగలే కానీ చిల్లర రాజకీయాలు చేయటం మానుకోవాలని అన్నారు.

Related posts

టీడీపీకి 40 వసంతాలు…ప్రత్యేక లోగో ఆవిష్కరించిన చంద్రబాబు!

Drukpadam

తుమ్మల హంగామా …దేనికి సంకేతం..!

Drukpadam

కాంగ్రెస్ ‘జనగర్జన’లో ప్రసంగించేది ఆ ఆరుగురే..!

Drukpadam

Leave a Comment