క్రైమ్ వార్తలు

సూర్యాపేట జిల్లాలో ఆరుగురు విద్యార్థుల అదృశ్యం

సూర్యాపేట జిల్లాలో ఆరుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతుంది.. అసలు విద్యార్థులు ఎటు వెళ్లారా అని ఉపాధ్యాయులు వెతుకుతున్నారు. అసలు విద్యార్థులు వెళ్లిపోవడానికి గల కారణాలపై ఉపాధ్యాయులు ఆరా తీశారు. వారికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. కోదాడ మండలం దోరకుంట సమీపంలోని నెమలిపురిలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు కనిపించడం లేదు.


రెండు రోజుల క్రితం పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. అయితే పార్టీలో పదిమంది విద్యార్థులు గొడవకు దిగారు. విద్యార్థులను ఉపాధ్యాయులు మందలించడంతో ఎవరికి చెప్పకుండా పరారయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గరి నుంచి కనిపించకుండా పోయారు. విద్యార్థులు ఎటు వెళ్లారోనని ఉపాధ్యాయులు వెతికారు. ఎంతకు వారి ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులు పాఠశాలలో కనిపించడం లేదని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తీవ్రఆందోళనకు గురయ్యారు. ఎక్కడికి వెళ్లారో తెలియక భయాందోళనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు. కోదాడ రూరల్ పొలీసులకు ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యార్థుల కోసం అన్వేషిస్తున్నారు.

Related posts

గర్భిణీ తల్లిని తుపాకీతో కాల్చి చంపిన రెండేళ్ల బాలుడు!!

Drukpadam

డేటా చోరీ కేసు నిందితుడు వినయ్ భరద్వాజ అరెస్ట్!

Drukpadam

నీ రక్తం తాగుతా’ అంటూ కన్నతల్లిపై కూతురు దాడి…

Ram Narayana