Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉగ్రరూపం …మూడవ ప్రమాద హెచ్చరిక జారీ :భద్రాచలం లోనే మంత్రి పువ్వాడ మకాం

తెలంగాణలో కుమ్మేస్తున్న భారీ వర్షాలు…

పలు రైళ్ల రద్దు, పరీక్షలు వాయిదా వేసిన కాకతీయ, ఉస్మానియా

  • గత కొన్నిరోజులుగా విస్తారంగా వర్షాలు
  • విద్యాసంస్థలకు మూడ్రోజుల సెలవులు
  • రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. … భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు తడిసి ముద్దయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ ప్రజలు అక్కడ తమ పనులు మానేసి ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనం స్తంభించింది. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. హైద్రాబాద్ మహానగరంలో సహా అన్ని నగరాలూ పట్టణాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు నీళ్లలోనే ఉన్నారు . వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి .భద్రాచలం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహించడంతో 53 కు చేరింది.  దాంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి భోజన సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అనేకచోట్ల చెరువులు కుంటలకు గండ్లు పడ్డాయి. సింగరేణి ఏరియా లో ఓపెన్ కాస్ట్ లో అన్నీ మూతపడ్డాయి దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ప్రధాన రహదారుల వెంట వరదలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కొట్టుకుపోయాయి దీంతో రవాణాకు ఇబ్బంది ఏర్పడింది. అనేకచోట్ల చెట్లు కూలిపోయాయి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి వీటిని పునరుద్ధరించేందుకు సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ఎప్పటికీ పునరుద్ధరిస్తారు తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. కోసం సహాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు తనకు సహాయం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు .
భద్రాచలం లో మంత్రి పువ్వాడ …
ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి అజయ్ కుమార్ ఖమ్మం తో పాటు అటు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి ఈరోజు పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఖమ్మం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరును పరిశీలించిన మంత్రి అధికారులకు తగిన సలహాలు సూచనలు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పువ్వాడ అంట జిల్లా కలెక్టర్ గౌతమ్ సి పి విష్ణు వారియర్ ఉన్నాను అదేవిధంగా భద్రాచలంలోని కలెక్టర్ ఎస్పి విప్ రేగా కాంతారావు ఇతర అధికారులు అశ్వరావుపేట శాసనసభ్యుడు నాగేశ్వరరావు ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పరిస్థితిను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 53 అడుగులకు చేరిన నీటిమట్టం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించి, సమీక్షించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

ఎగువ నుంచి వస్తున్న వరదలతో పాటు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతూ 53 అడుగులు దాటింది దీంతో మూడో ప్రమాద హెచ్చరిక ను అధికారులు జారీ చేశారు.

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి ప్రవాహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా పరిశీలించారు. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ అధికారులతో మంత్రి అజయ్ సమీక్షించారు.

గోదావరి వ‌ద్ద ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ముందస్తు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

గత రెండు రోజులుగా వర్షాలు, వరదల పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు, అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచనలు చేస్తున్నారు.

గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేసిన నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని సూచించారు.

కాలువలు, చెరువులు, కుంట‌లు, చెక్ డ్యామ్స్ వ‌ద్ద కూడా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రెవెన్యూ, పంచాయ‌తీరాజ్‌, ఇరిగేష‌న్, విద్యుత్, పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర‌స్థాయిలో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని చెప్పారు. అత్య‌వ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాల‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

 

రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళతో తొణికిసలాడుతున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. హైదరాబాదులో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. పలు చోట్ల నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కాగా, భారీ వర్షాల ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

అటు, పలు జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. నేడు, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. పరీక్షలు జరిగే కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Related posts

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ బదిలీ… ఏపీ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం!

Drukpadam

ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో కేసులో త‌దుప‌రి చ‌ర్య‌ల నిలిపివేత‌!

Drukpadam

దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవద్దంటూ పిటిషన్లు…

Drukpadam

Leave a Comment