మల్లెల తీర్థం జలపాతానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీస్!
-అచ్చంపేట నుంచి ప్రతి రోజూ రెండు సర్వీసులు
-ఉదయం, సాయంత్రం వేళ్లలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ
-హైదరాబాద్ నుంచి దూరం 173 కిలోమీటర్లు
ప్రపంచంలోని 7 వింతలలో ఒక వింత గా చెప్పబడుతున్న నయాగరా జలపాతాన్ని తలపించేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో జలపాతం ఉండడం విశేషం. ఇది శ్రీశైలానికి అతి సమీపంలో ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లాలంటే 173 కిలోమీటర్ల ప్రయాణం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి అక్కడకు వెళ్ళేందుకు కేవలం 55 కిలోమీటర్ల దూరం. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలు మల్లెలతీర్థం వాటర్ ఫాల్స్ చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు . వేలాది మంది పర్యాటకులు మల్లెల తీర్థం లో స్నానమాచరించాలనే ఉద్దేశంతో ప్రత్యేక వాహనాల ద్వారా బస్సుల ద్వారా వెళ్ళుతున్నారు . ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ఇది పెద్ద పర్యాటక కేంద్రంగా నిలుస్తుందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
తెలంగాణ ఆర్టీసీ శ్రీశైలంలోని మల్లెల తీర్థానికి రోజువారీ ప్రత్యేక బస్సు సర్వీస్ ను ఆరంభించింది. ప్రతి రోజూ ఈ బస్సు సర్వీసు మల్లెల తీర్థం జలపాతానికి పర్యాటకులను తీసుకెళ్లనుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి ఈ సర్వీసు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు బయల్దేరుతుంది. అక్కడి నుంచి మళ్లీ 8.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది.
అలాగే, ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు మరో సర్వీసు ఉంటుంది. ఇది కూడా సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరుతుంది. హైదరాబాద్ నుంచి మల్లెల తీర్థం 173 కిలోమీటర్ల దూరంలో ఉంది. అచ్చంపేట నుంచే 55 కిలోమీటర్లు ఉండడం గమనార్హం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఈ జలపాతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. దీంతో వారి సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు ఏర్పాటు చేసింది.