Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పార్లమెంట్​లో ఈ పదాలు ఇక వాడకూడదు.. బుక్ లెట్ విడుదల!

పార్లమెంట్లో పదాలు ఇక వాడకూడదు.. బుక్ లెట్ విడుదల!
నెల 18 నుంచి జరిగే వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రస్తావించొద్దని కొన్ని పదాలతో బుక్ లెట్
అవినీతి పరుడు, అసమర్థుడు, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటివి అన్ పార్లమెంటరీ పదాలుగా గుర్తింపు
మాటలు వాడిన వారిపై చర్యలకు లోక్ సభ, రాజ్యసభ అధిపతులకే అధికారం

చట్ట సభల్లో ప్రజా ప్రతినిధులు ఇష్టానుసారం వ్యవహరిస్తుంటారు. తమ హోదా, వయసు అన్నీ మరిచి ఒకరినొకరు తిట్టుకుంటారు. బూతులు మాట్లాడుతారు. ఒక్కోసారి చొక్కాలు పట్టుకొని కొట్టుకునేందుకూ వెనుకాడరు. ఇకపై పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నెల 18వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఒక బుక్లెట్ ను విడుదల చేసింది. కొన్ని అభ్యంతరకర పదాలను అందులో పేర్కొంది. వాటిని ఉభయ సభల్లోనూ సభ్యులు వాడకూదని స్పష్టం చేసింది. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్‌ వంటి పదాలను అన్ పార్టమెంటరీ పదాలుగా గుర్తించింది. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు.

బ్లడ్‌షెడ్, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, అబ్యూస్డ్, చీటెడ్, కరప్ట్, కవర్డ్, క్రిమినల్, క్రొకొడైల్‌ టియర్స్, డాంకీ, డ్రామా, ఐవాష్, హూలిగనిజం, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, అన్‌ట్రూ, కోవిడ్‌ స్ప్రెడర్, స్నూప్‌గేట్‌ వంటి ఇంగ్లిష్ పదాలను ఆ జాబితాలో చేర్చింది. వీటితో పాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్‌మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి.

వివిధ సందర్భాల్లో దేశంలోని చట్ట సభలు, కామన్వెల్త్ దేశాల పార్లమెంట్లలో స్పీకర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పదాలను బుక్ లెట్లో చేర్చారు. అయితే, ఇలాంటి పదాలను వాడిన సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అధికారం లోక్ సభ, రాజ్య సభ అధిపతులకే ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది.

These Words to be identifies as unparliament in lok sabha and rajya sabha

Related posts

బీజేపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఖమ్మంలో గెలవలేరు…కూనంనేని

Drukpadam

చిన్నమ్మ బెంగుళూరు టూ చెన్నై ఖర్చు 200 కోట్లు

Drukpadam

తప్పుడు హామీలిచ్చేవారిని, షార్ట్ కట్ రాజకీయాలు చేసేవారిని నమ్మొద్దు: మోదీ!

Drukpadam

Leave a Comment