Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌!

నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌!
-వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌దే విజ‌యమ‌న్న ఉత్త‌మ్‌
-రాహుల్ గాంధీపై మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు ఉందా అని ప్ర‌శ్న‌
-శ్రీలంక‌లో రాజ‌పక్సకు ప‌ట్టిన గ‌తే కేసీఆర్‌కు త‌ప్ప‌ద‌ని జోస్యం

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. ఈ మేర‌కు శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా కేటీఆర్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై ఉత్త‌మ్ విరుచుకుప‌డ్డారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని మాజీ పిసిసి అధ్యక్షుడు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు . రాహుల్ గాంధీ పై వై కే టీ ఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్ ఉందా అని ప్రశ్నించారు? కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మయమందని మేము కాదు ప్రజలే అంటున్నారని ,ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యమకారులను పార్టీలో నుంచి వెళ్లగొట్టి తెలంగాణ కు సంబంధం లేని వారిని అందలం ఎక్కించి కుటుంబపాలన చేస్తున్నారని ప్రజల్లో బలంగా ఉందని అన్నారు . అందువల్ల శ్రీలంకలో రాజపక్షేకు పట్టిన గతి ఎన్నికల అనంతరం కేసీఆర్ కుటుంబానికి పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా కేటీఆర్ మాట్లాడటం నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు . తెలంగాణలో కెసిఆర్ మాయ మాటలు నమ్మే రోజులు పోయాయని , తెలంగాణ ప్రజలు చైతన్యవంతులను అన్నారు . కెసిఆర్ చెప్పిన మాటలకు చేసే పాలనకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు పేర్కొన్నారు .

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో కాంగ్రెస్‌దే విజ‌య‌మ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్య‌లు అహంకార‌పూరిత‌మైన‌వేన‌ని ఆయ‌న అన్నారు. కేటీఆర్ ఎంత‌?… ఆయ‌న స్థాయి ఎంత? అని కూడా ఉత్త‌మ్ ప్ర‌శ్నించారు. శ్రీలంక‌లో రాజ‌ప‌క్స కుటుంబానికి ప‌ట్టిన గ‌తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ కుటుంబానికి త‌ప్ప‌ద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.

Related posts

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఇక యుద్ధమే !

Drukpadam

ఆంధ్రాలో ఉండే వాళ్ళంతా రాక్షసులే అన్నదానిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరణ….

Drukpadam

ఖమ్మం అభివృద్ధి గుమ్మం…

Drukpadam

Leave a Comment