మహా ఉగ్ర గోదారి ….భద్రాచలం వద్ద 71 అడుగులు…ఇక శాంతించే అవకాశం!
-బిక్కుబిక్కుమంటూ ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని గడుపుతున్న వైనం
-భద్రాచలం వద్ద ప్రస్తుతం 24 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం
-పేరూరు దగ్గర తగ్గిన 5 అడుగుల ప్రవాహం
-చర్ల వద్ద తగ్గినా రెండు అడుగులు
-రంగంలోకి సైన్యం …రాష్ట్ర ప్రభత్వం నుంచి ప్రత్యేక అధికారులు
-మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలో మకాం
గత నాలుగు రోజులుగా గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉగ్ర గోదావరి …నేటి రాత్రికి మహా ఉగ్రరూపం దాల్చి 71 అడుగులకు చేరుకుంది.దీంతో భద్రాచలం బ్రిడ్జి పై రాకపోకలను నిషేదించారు . భద్రాచలానికి వచ్చే రహదారులన్నీ నీటమునగటంతో దార్లు అన్ని కట్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు మంత్రి అజయ్ అధికారులు నానా యాతన పడాల్సి వచ్చింది. కొందరు తమ ఇంటి చుట్టూ నీరు చేరి ఇళ్లలోకి నీరు వచ్చిన పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ససేమీరా అన్నారు . చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి బలవంతంగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలిసి వచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గొడవై పరివాహక జిల్లాల కలెక్టర్లతో నిరంతరం టచ్ లో ఉండి వారికీ కావాల్సిన సహాయం అందించారు . భద్రాచలం నుంచి మంత్రి అజయ్ ప్రతి గంటకు ఇక్కడ జరుగుతన్న పరిణామాలు పై రిపోర్ట్ ఇస్తూ జిల్లా అధికార యంత్రాగంతో సమన్వయము చేశారు . ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను కూడా ప్రభుత్వం అందజేసింది.
నీటితో నిండిన టెంపుల్ సిటీ
భద్రాచలం పట్టణం గోదావరి వరద ఉధృతితో నీటితో నిండిపోయింది. కాలనీలాన్ని జలమయం అయ్యాయి. వరద ఉదృతి పెరగటంతో ఆందోళన మొదలైంది . రాష్ట్రప్రభుత్వ కోరిక మేరకు సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఎన్డీఎఫ్ ఎన్ ఆర్ డి ఎఫ్ బలగాలు కూడా వచ్చాయి. ప్రజలను అప్రమత్తం చేశారు . 8 మండలాల పరిధిలోని 62 గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు . భద్రాచలం , బూర్గంపహాడ్ మండలాల్లో 144 సెక్షన్ విధించారు .
సీఎల్పీ నేత భట్టి పర్యటన ….
గోదావరి వరదలను పరిశీలించి పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సహాయాలు గురించి తెలుసుకునేందుకు సీఎల్పీ నేత భట్టి ,విక్రమార్క , భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు , రాయల నాగేశ్వరరావు తదితరులు వెళ్లారు . బ్రిడ్జి పై నిషేధం ఉన్నప్పటికీ ఇసుక వాహనాలు నడవటాన్ని వారు గుర్తించారు .