Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు …కొత్తగూడెం కేంద్రంగా డీహెచ్ శ్రీనివాసరావు…

వరద ప్రభావిత ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు …కొత్తగూడెం కేంద్రంగా డీహెచ్ శ్రీనివాసరావు…
-డాక్టర్లు సెలవులు తీసుకోవద్దు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు
-వరద ప్రభావిత జిల్లాల వైద్యాధికారులతో హరీశ్ రావు సమీక్ష
-అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం
-ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్న హరీశ్

వరద ప్రభావిత ప్రాంతాల్లో వార్ ఫుట్ మీద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు డాక్టర్ల ఆదేశాలు జారీచేశారు . ఈరోజు హైదరాబాద్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అందువల్ల డాక్టర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ శెలవు తీసుకోకుండా విధుల్లో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహించి అంటువ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . ప్రత్యేకంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక గ్రామాలూ వరదలు వచ్చి నీటమునిగాయని అలంటి గ్రామాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైతే అక్కడ క్యాంపు ఏర్పాటు చేసి డాక్టర్లు ఆ క్యాంపులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్తగూడెం కేంద్రంగా నిర్వహించే హెల్త్ క్యాంపులకు ప్రత్యేక అధికారి గా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డాక్టర్ శ్రీనివాసరావు ను నియమించారు. అదేవిధంగా మంచిర్యాల కేంద్రంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి ని ప్రత్యేక అధికారిని నియమించినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు ఈ ఇద్దరు అధికారులు ఆయా ప్రాంతాల్లో జరిగే హెల్త్ క్యాంపు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు .

వరద ముంపుకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని హరీశ్ రావు అన్నారు . ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలని చెప్పారు. వైద్యులు సెలవులు తీసుకోకుండా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పాల్గొనాలని తెలిపారు. అవసరమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరా చేయాలని చెప్పారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల జిల్లాల వైద్యాధికారులతో, డాక్టర్లతో ఈరోజు హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెం కేంద్రంగా రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మంచిర్యాల కేంద్రంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్ రెడ్డి విధులు నిర్వహిస్తూ… హెల్త్ క్యాంపులు, ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పాల్గొనాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related posts

రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ వార్నింగ్…

Drukpadam

ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా… సెంట్రల్ విస్టా పూర్తికి డెడ్ లైన్ విధించిన కేంద్రం!

Drukpadam

నా కుమారుడ్ని కిడ్నాప్ చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: రాజా సింగ్

Drukpadam

Leave a Comment