Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

లాయర్లు రూ.10-15 లక్షలు ఫీజులా.. సామాన్యుల పరిస్థితి ఏంటి?: కేంద్ర మంత్రి రిజిజు!

లాయర్లు రూ.10-15 లక్షలు ఫీజులా.. సామాన్యుల పరిస్థితి ఏంటి?: కేంద్ర మంత్రి రిజిజు!
-అసాధారణ ఫీజులపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి
-సామాన్యులకు న్యాయం దూరమవుతుందన్న ఆందోళన
-వాడుకలో లేని 71 చట్టాలను పార్లమెంట్ సమావేశాల్లో రద్ధు చేస్తామని ప్రకటన

ప్రముఖ న్యాయవాదులు వసూలు చేస్తున్న భారీ ఫీజుల పట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పేదలు, సామాన్యులకు న్యాయం అందకుండా చేసినట్టు అవుతుందన్నారు. పెద్దమొత్తంలో ఫీజులు వాసులు చేయడం పై ఆయన ఆందోళన వ్యక్త చేశారు . డబ్బుకు మంత్రమే న్యాయమని ఇప్పటికే ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి కేంద్రమంత్రి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

‘‘డబ్బున్న వారు పెద్ద లాయర్ల ఫీజులను భరించగలరు. సుప్రీంకోర్టు లాయర్లు కొందరు వసూలు చేసే ఫీజులను సామాన్యులు చెల్లించుకోలేరు. వారు ఒక్కో విచారణకు రూ.10-15 లక్షల చార్జీ వసూలు చేస్తుంటే సామాన్యులు ఎలా చెల్లించుకోగలరు?’’ అని మంత్రి రిజిజు ప్రశ్నించారు. జైపూర్ లో 18వ అఖిల భారత లీగల్ సర్వీసెస్ అథారిటీస్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాడుకలో లేని 71 చట్టాలను రద్ధు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం గెహ్లాట్.. బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. నడుస్తున్న ఉద్యమం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బేరసారాల ద్వారా ప్రభుత్వాలను మారుస్తున్నారంటూ బీజేపీపై మరోసారి విమర్శలు చేశారు.

హైకోర్టులు, దిగువస్థాయి కోర్టుల్లో స్థానిక భాషలు వినియోగించాలి: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు

Union minister pressed that high courts and lower court should give priority to regional and local languages
ప్రాంతీయ భాషల్లో కోర్టు తీర్పులు ఉండాలన్న వాదనకు బలం చేకూర్చేలా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు చేశారు. జైపూర్ లో 18వ ఆలిండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశాల ప్రారంభంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టులు, దిగువస్థాయి న్యాయస్థానాల్లో ఆయా వ్యవహారిక అంశాల్లో ప్రాంతీయ, స్థానిక భాషలు వినియోగించాలన్నదే తమ అభిమతని తెలిపారు. ఇంగ్లీషు కంటే మన మాతృభాష తక్కువది అనే భావనను విడనాడాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు, ఇంగ్లీషులో బాగా మాట్లాడే న్యాయవాదులకే ఎక్కువ కేసులు, ఫీజులు, గౌరవం అనే వాదన సరికాదని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క న్యాయస్థానం కూడా కేవలం ఉన్నత వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వరాదని, సమాన రీతిలో అన్ని వర్గాలకు న్యాయస్థానం తలుపులు తెరిచి ఉంచాలని హితవు పలికారు.

“సుప్రీం కోర్టులో వాదనలు, తీర్పులు ఎలాగూ ఆంగ్లంలోనే ఉంటాయి. కానీ, మా ఆలోచన ఏంటంటే… హైకోర్టులు, అంతకంటే దిగువ కోర్టుల్లో ప్రాంతీయ, స్థానిక భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం” అని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.

Related posts

తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..ఒత్తిడి చేయొద్దని ఆదేశం!

Drukpadam

యమునా నదిలో విషపు నీరు మధ్య మహిళల చట్ పూజ పుణ్యసాన్నాలు !

Drukpadam

అన్యాక్రాంతం అయిన వక్ఫ్ భూములను వెనక్కు తీసుకోవాలి:భట్టి

Drukpadam

Leave a Comment