Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వ‌రంగ‌ల్‌లో కేసీఆర్‌… కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటిలో స‌మీక్ష‌!

వ‌రంగ‌ల్‌లో కేసీఆర్‌… కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటిలో స‌మీక్ష‌!

  • వ‌ర‌ద ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న‌కు వెళ్లిన కేసీఆర్‌
  • రాత్రికి వ‌రంగ‌ల్‌లోనే బ‌స చేయ‌నున్న సీఎం
  • ఆదివారం ఉద‌యం వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌
ts cm kcr reaches warangal and visits flood areas tomorrow

తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి వ‌రంగ‌ల్ చేరుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రంలోని గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాలు నీట మునిగిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద ప్రాంతాల ప‌ర్య‌ట‌న కోసం శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరిన కేసీఆర్‌… రాత్రికి వ‌రంగ‌ల్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ సీనియ‌ర్ నేత కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ఇంటిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఆయ‌న స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

రాత్రికి వ‌రంగ‌ల్‌లోనే బ‌స చేయ‌నున్న కేసీఆర్‌… ఆదివారం ఉద‌యం గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఏటూరునాగారం తదితర వరద ప్రభావిత, ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌ర‌ద‌ సహాయ కార్యక్రమాలు, ఇప్ప‌టిదాకా తీసుకున్న‌ చర్యలపై ప‌రిశీల‌న జ‌ర‌ప‌నున్నారు. ముంపు ప్రాంతాల ప‌రిశీల‌న అనంత‌రం ఆదివారం సాయంత్రం ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ బ‌య‌లుదేర‌నున్నారు.

Related posts

ఏప్రిల్ 9 న ఖమ్మంలో షర్మిల శంఖారావం…?

Drukpadam

A $1495 Flamingo Dress: The Pink Bird Is Dominating Fashion

Drukpadam

లండన్‌లో మరో భారత సంతతి వ్యక్తి హత్య!

Drukpadam

Leave a Comment