Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్విత ప్రాతిపదికన ఇల్లు నిర్మించి ఇవ్వాలి …సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే సీతక్క వినతి…

ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్విత ప్రాతిపదికన ఇల్లు నిర్మించి ఇవ్వాలి …సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే సీతక్క వినతి…
-వరుద ల వలన ఇండ్లు కులిన బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం తో -పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయాలి
-కరకట్ట నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

ఇటీవల కురిసిన భారీవర్షాలకు ములుగు నియోజవర్గంలో వరదలకు గోదావరి ప్రవాహానికి ముంపుకు ప్రజలను మరియు రైతులను ఆదుకోవాలి ముఖ్య మంత్రి కెసిఆర్ కు వినతి పత్రం అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, కొత్తగూడ మరియు గంగారం మండలాలలో ఒకపక్క వర్షపు నీరు మరోపక్క గోదావరి ప్రవాహమునకు ఇండ్లలోకి పంట పొలాల్లోకి నీళ్ళు చేరి ఇండ్లు పూర్తిస్థాయిలో నేలమట్టం అయ్యింది. వరినార్లు,పత్తి మొక్కలు మరియు మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు మరియు ప్రజలు చాలా ఇబ్బందిలకు గురై పునరవాస కేంద్రాలలో బ్రతుకు జీవుడని ి ప్రాణాలను హరిచేతులో పట్టుకొని బ్రతికినారు అని సీతక్క ముఖ్య మంత్రి కెసిఆర్ కు వివరించారు
1.ఏటూర్ నాగారం, కన్నాయిగూడెం మంగపేట మరియు తాడ్వాయి మండలాలతో పాటు మిగతా మండలాల్లో లోతట్టు ప్రాంతాలలో ఉన్న 10,000 కుటుంబాల ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇండ్లును సురక్షిత ప్రాంతాల్లో నిర్మించి ఇవ్వవలెను.
2.ములుగు నియోజకవర్గంలో 9 మండలాలలో కురిసిన భారీ వర్షాలు కారణంగా గోదావరి మరియు వర్షపు వరదల వల్ల ఐ టి డి ఏ, పంచాయతీ రాజ్ మరియు ఆర్ &బి రోడ్లు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలి.
3.పాకాల చెరువు,లక్నవరం మరియు రామప్ప చెరువుల వరద వల్ల ముప్పుకు గురైన రైతులను మరియు ప్రజలను ఆదుకోవాలి.
4.తుపాకులగూడెం, ఏటురునాగారం నుండి రామన్నగూడెం మరియు మంగపేట మండలంలో అకీనపల్లి మల్లారం వరకు కరకట్టకు రివుట్మెంట్ చేసి కాంక్రీట్ వాల్ నిర్మించాలి, ఏటురునాగారం, కన్నయుగుడెం మరియు మంగపేట మండలాలలో గోదావరి కోతకు గురైన పంట భూములు అంచనా వేసి రైతులను ఆదుకోవాలి.
5.గోదావరి వరద ముప్పుకు గురైన వారందరికి తక్షణమే ఒక్కక్క ఇంటికి 25000/- రూll ల నుంచి 50,000 వరకు నష్ట పరిహారం అందించాలి.
6. గోదావరి ముప్పకు గురైన ములుగు నియోజకవర్గ ప్రజలు,అట్టి గ్రామానికి సంబందించిన స్థలంలో ఇండ్ల నిర్మాణం అభివృద్ధి పనులను (రోడ్లు,కరెంటుపొల్లు,బ్రిడ్జి) నిర్మాణ అభివృద్దికి ఆటంకముగా ఫారెస్టు అధికారుల పనితీరు పై చర్యలు తేసుకోగలరు.
7.రాష్ట్ర ప్రభుత్వం గోదావరి కరకట్ట నిర్మాణం కోసం 137 కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనులు చేపట్టకపోవడంతో గోదావరి వరద నీరు గ్రామాలలోకి ప్రవహించి ఇండ్లు మునిగిపోయాయి, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మాణ పనులు ప్రారంభించాలి.
8.ములుగు నియోజకవర్గంలో అన్ని మండలాలలో ఏజేన్సీ గ్రామాలలో వర్షానికి ఇంటర్నల్ రోడ్లు దెబ్బతిని, సైడ్ కాల్వలు లేక గుంతలుగా ఏర్పాడి నీళ్లు నిలవ ఉండడంతో విషజర్వాల భారిన పడి ప్రాణాలను కోల్పోచున్నారు.కావున అన్ని మండలాలలో రోడ్లు మరియు సైడ్ కాల్వలను ప్రత్యేక పాకేజీ కింద నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతూ హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించి ముప్పు ప్రాంతాలలో వైద్య బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించాలినీ వినతిలో పేర్కొన్నారు.

Related posts

ఈనెల 8 ప్రధాని మోడీ బహిరంగ సభను జయప్రదం చేయండి …పొంగులేటి

Drukpadam

పాలేరునుంచి తిరిగి కందాల పోటీ ..మంత్రి ప్రశాంత రెడ్డి….!

Drukpadam

దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా: మంద కృష్ణ…

Drukpadam

Leave a Comment