రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపారు: యశ్వంత్ సిన్హా!
- ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారన్న సిన్హా
- ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని విన్నపం
- తాను ప్రభుత్వ ఏజెన్సీలపై కూడా పోరాడుతున్నానని వ్యాఖ్య
రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల అభ్యర్థిగా బరిలో నిలిచినా యస్వంత్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు . డబ్బు ఇతర ప్రలోభాలతో కోట్లను దండుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు . ప్రభుత్వ ఏజన్సీలద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు చీల్చి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం లోని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కూడా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కేవలం రాష్ట్రపతి ఎన్నికల కోసమే తన పోరాటం కాదని వ్యవస్థలను నాశనం చేసే వారిపై తనపోరాటమన్నారు . రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయపార్టీలు విప్ జారీచేసే అవకాశం లేదని అన్నారు . జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అందువల్ల ప్రలోభాలు డబ్బు అధికార దుర్వినియోగం ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు విపక్షాల తరపున బరిలోకి దిగిన అభ్యర్థి యశ్వత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు ఎరగా వేశారని, ప్రలోభాలకు తెరలేపారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ విప్ లు పని చేయవని…. ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని కోరారు.
రాష్ట్రపతి ఎన్నికల ఫలితం ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ప్రజాస్వామ్య విరుద్ధంగా కూల్చి వేశారని దుయ్యబట్టారు. తాను కేవలం రాజకీయ యుద్ధంలోనే కాకుండా, ప్రభుత్వ ఏజెన్సీలపై కూడా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ ఏజెన్సీలు చాలా శక్తిమంతంగా తయారయ్యాయని… అవి పార్టీలను కూడా చీల్చుతున్నాయని విమర్శించారు.