Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ….?

రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ….?
-ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక.. 98.90 శాతం ఓటింగ్:ఓటు వేయని ఎనిమిది మంది ఎంపీలు!
-ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
-స్పీకర్ ఓం బిర్లా , సోనియా ,రాహుల్ , అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్
-రాష్ట్రాల్లో ఓట్లు వేసిన సీఎంలు, ఎమ్మెల్యేలు
-తెలుగు రాష్ట్రాల్లో 4 ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరం …

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ప్రశాంతంగా ముగిసింది. అనేక రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు ఓటివేశారని తెలుస్తుంది. జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ముందుగానే ముర్ము కు ఓటేస్తామని చెప్పాయి. అయితే అన్యుహంగా మహారాష్ట్ర పరిణామాలు కూడా ఎన్డీఏ కు ప్లస్ అయ్యాయి. కొంతమంది అక్కడక్కడా క్రాస్ ఓట్లు వేశారని ప్రలోభాలకు గురిచేశారని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యస్వంత్ సిన్హా సైతం అన్నారు .

ఉదయం పది గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది. ఈ పోలింగ్లో.. 98.90 శాతం ఓట్లు పడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్‌ షా, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి నేతలు పార్లమెంట్‌ ఆవరణలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరిగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఓటు వేశారు. వీరితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేవలం 8 మంది ఎంపీలు మాత్రం ఓటు వేయలేకపోయారు.

రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఓట్లు వేశారు. అయితే పోలింగ్ కోసం రాష్ట్రాలకు పంపించిన బ్యాలెట్ బాక్సులు సోమవారం రాత్రికి పార్లమెంట్‌కు చేరుకోనున్నాయి. ఆ బాక్సులను ఢిల్లీకి తరలిస్తున్నట్టు రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలియజేశారు. ఈ ఓటింగ్‌లో 727 ఎంపీలకు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు పార్లమెంట్‌లో ఓటేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వగా అందులో 728 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. అయితే ద్రౌపది ముర్ముకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. ఎందుకు ముర్ముకు 44 పార్టీలు మద్దతిచ్చాయి. కాగా జూలై 21న రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రిజల్ట్‌ను వెల్లడిస్తారు. జూలై 25న కొత్త రాష్టప్రత ప్రమాణా స్వీకార కార్యక్రమం ఉంటుంది.

Related posts

ఎన్నికలప్పుడే పొత్తులు ,ఎత్తులు :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..!

Drukpadam

డబుల్ బెడ్ రూమ్ ల పేరుతొ అసలు ఇల్లులేకుండా చేస్తున్న తెలంగాణ సర్కారు:తమ్మినేని…

Drukpadam

బండి సంజయ్ కి అజయ్ కౌంటర్ అదిరింది

Drukpadam

Leave a Comment