Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ద్రౌప‌ది ముర్ము గెలుపు కోసం భూదేవికి ప్ర‌ణ‌మిల్లిన గిరిజ‌నం… 

ద్రౌప‌ది ముర్ము గెలుపు కోసం భూదేవికి ప్ర‌ణ‌మిల్లిన గిరిజ‌నం… 

  • సోమ‌వారం ముగిసిన రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌
  • గురువారం వెల్ల‌డి కానున్న ఫ‌లితాలు
  • గిరిజ‌నుల ఫొటోల‌ను పోస్ట్ చేసిన కిష‌న్ రెడ్డి

రేపే రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్… ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే… దేశ రాష్ట్రపతి పదవి కోసం జరిగిన పోటీలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపతి ముర్ము పోటీచేయగా విపక్షాల నుంచి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ బరిలో నిలిచారు. అయితే ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోరాడితే రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒక సందర్భంలో ఎన్డీఏ కూటమికి 49% విపక్షాలకు 51% కోట్లు లెక్క తేలింది. పరిణామాల అత్యంత వేగంగా మారిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిగా సంతాల్ గిరిజన తెగకు చెందిన ముర్ము ను పోటీకి దింపడం తో పరిస్థితులు మారాయి. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దింపినప్పటికీ విపక్ష పార్టీలు నుంచి కూడా గిరిజామహిళగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కొన్ని పార్టీలు మద్దతు తెలపడంతో గెలుపు నల్లేరు మీద నడకే గా మారింది. 60 శాతం పైగా ఓట్లు వచ్చే ఓట్లు రావొచ్చని అంచనా. గురువారం రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఫలితం అదేరోజు ప్రకటిస్తారు .గిరిజన తెగకు చెందిన మహిళా దేశ అత్యున్నత పదవిని చేపట్టనుండటం మంచి అవకాశంగా గిరిజన తెగలు భావిస్తున్నాయి.

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ద్రౌప‌ది ముర్ము విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగియ‌గా… గురువారం ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. గురువారం సాయంత్రానికే విజేత ఎవ‌ర‌నేది తేలిపోనుంది. ద్రౌప‌ది ముర్ముకు పోటీగా కేంద్ర మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా బ‌రిలోకి దిగారు.

ఇక ముర్ము విజ‌యాన్ని కాంక్షిస్తూ ఆమె సామాజిక వ‌ర్గానికి చెందిన గిరిజ‌నులు భూదేవికి ప్ర‌ణ‌మిల్లి మ‌రీ ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. వంద‌లాది మంది ఒకే చోట చేరి భూమాత‌కు పూజ‌లు చేస్తున్న దృశ్యాలు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.
ఈ పూజ‌లు ఎక్క‌డ జ‌రిగాయో తెలియ‌దు గానీ… వీటిని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముర్ము కోసం గిరిజనులు ప్రార్థిస్తున్నటువంటి గొప్ప దృశ్యాలు ఇవి. ‘నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన ఆమె రాబోయే రాష్ట్రపతి పదవి వరకు సాధించిన ఔన్నత్యం భారతదేశం తన నాగరికత,రాజ్యాంగ విలువలు,ప్రజాస్వామ్యం పట్ల ఉన్న స్థిరమైన విశ్వాసానికి నిదర్శనం’ అంటూ కిష‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts

ఎన్నికలను ఆరు రోజులపాటు వాయిదా వేయండి: ఈసీకి లేఖ రాసిన పంజాబ్ సీఎం!

Drukpadam

టీఆర్ యస్ కు ప్రతిష్టాత్మకం …బీజేపీకి సంకటం …కాంగ్రెస్ కు ఆక్సిజెన్!

Drukpadam

విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్‌ పాలకవర్గం ఏర్పాటు చేయాలి

Drukpadam

Leave a Comment