Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అలసినట్టుగా అనిపిస్తే విరామం తీసుకోవచ్చు… సోనియా గాంధీకి ఈడీ వెసులుబాటు!

అలసినట్టుగా అనిపిస్తే విరామం తీసుకోవచ్చు… సోనియా గాంధీకి ఈడీ వెసులుబాటు!

  • నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు సమన్లు
  • మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ
  • నేడు మూడు గంటల పాటు ప్రశ్నించిన వైనం
  • సోనియా ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (75) నేడు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమెను ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నందున తనను గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే గదిలో విచారించాలని సోనియా ఈడీ అధికారులను కోరారు. అంతేకాదు, తనను విచారించే ఈడీ అధికారులు, ఇతర సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నారా? అని ఆరా తీశారు.

సోనియా పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమె పట్ల సానుకూల ధోరణి కనబర్చారు. అలసిపోయినట్టుగా అనిపిస్తే విరామం తీసుకునే వెసులుబాటు కల్పించారు. విచారణ జరుగుతున్నంత సేపు ప్రియాంక గాంధీ అదే భవంతిలో మరో గదిలో కూర్చున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వడానికి ఆమె వద్ద సోనియాకు అవసరమైన ఔషధాలు ఉన్నాయి.

కాగా, సోనియా ఆరోగ్య పరిస్థితి కారణంగా విచారణను ఈడీ అధికారులు త్వరగా ముగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెకు తాజా సమన్లు ఇంకా జారీ చేయకపోవడం ఆ విషయాన్ని బలపరుస్తోంది.

Related posts

కరోనా పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన మోదీ!

Drukpadam

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు…

Drukpadam

విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య

Ram Narayana

Leave a Comment